భారతదేశం దేవాలయాల దేశం.రహస్యాలు, అద్భుతాలు కోకొల్లల్లుగా ఉన్న అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.
చాలా దేవాలయాలలో నమ్మశక్యంకాని అద్భుతాలను కనిపిస్తాయి.ఈ ఆలయాలలో జరిగే సంఘటనల వెనుక ఉన్న రహస్యాలను నేటికీ ఎవరూ ఛేదించలేదు.
ఈ దేవాలయాలలో మధ్యప్రదేశ్‌లో ఉన్న మైహార్‌లో ఉన్న శారదామాత శక్తిపీఠం ఒకటి.మైహర్‌లోని శారదా దేవాలయం అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటి.
సతీమాత హస్తం ఇక్కడే పడిందని చెబుతారు.ఈ ఆలయం త్రికూట పర్వతంపైన ఉంది.
పర్వత శిఖరంపై నిర్మించిన ఈ ఆలయంలో నిష్టతో అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతారు.
ఈ ఆలయం చాలా అద్భుతం.
ఈ ఆలయంలో ప్రతిరోజూ ఒక అద్భుత సంఘటన జరుగుతుంది.రాత్రి ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత, పూజారులు కూడా పర్వతం దిగి ఇళ్లకు వెళతారు.
ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరు.కానీ మరుసటి రోజు ఉదయం, పూజారి రాకముందే, అమ్మవారి ముందు తాజా పూలు కనిపిస్తాయి.
ఈ తాజా పూలను వీర యోధులు.దేవతకు సమర్పించారని నమ్ముతారు.
ఈ ఆలయానికి వీరయోధులు ఎవరికీ కనిపించకుండా ప్రతిరోజూ అమ్మవారిని పూజించడానికి ఆలయానికి వస్తుంటారు.ఈ యోధులిద్దరూ ఈ దట్టమైన అడవిలో పర్వతంపై ఉన్న శారదా మాత పవిత్ర నివాసాన్ని కనుగొన్నారు.

ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు.శారదా దేవి తన కఠోర తపస్సుకు సంతసించి వారికి అమరత్వం అనే వరం ఇచ్చిందని చెబుతారు.అలాగే ఈ ఆలయానికి సంబంధించిన మరో కథనం ప్రకారం, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వీరయోధులు వారి నాలుకను కోసి అమ్మవారికి సమర్పించారు.అప్పుడు తల్లి వారి భక్తికి సంతసించి వారి నాలుకను తిరిగి జోడించిందట.
ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి 1001 మెట్లు ఎక్కాలి.అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ప్రారంభమైంది.