పురాణాల ప్రకారం జయ విజయాలు ఇద్దరూ విష్ణుమూర్తి వైకుంఠంలో కావలి ఉండేవారు.ఇప్పటికి విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో కూడా వీరి విగ్రహాలు మొదట్లోనే ఉంటాయి.
ఎప్పుడు స్వామివారి సేవలో మునిగి ఉండే మహా భక్తులు శ్రీ మహావిష్ణువుకి ఎందుకు విరుధులుగా మారాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకరోజు బ్రహ్మ మానస పుత్రులు వైకుంఠానికి వస్తారు.
వీరంతా శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వచ్చి మొదటి ఆరు ద్వారాలను తమ మహిమతో దాటుకుని వెళ్లిపోతారు.ఏడవ ద్వారానికి రాగానే వారిని శ్రీ మహావిష్ణువు పరమ భక్తులైన జయ విజయాలు కనిపెట్టి ఆపుతారు.
మేము శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వచ్చామని వారు చెబుతారు.అయితే జయ విజయాలు మానస పుత్రులను లోపలికి వెళ్ళనివ్వరు.
వారంతా తమ గురించి చెప్పకున్నప్పటికీ జయ విజయాలు లోపలికి వెళ్ళనివ్వరు.అప్పుడు ఆగ్రహించిన ఆ మహానుభావులు భూలోకంలో రాక్షసులుగా జన్మించాలని శాపం ఇస్తారు.
అప్పుడు విరు వచ్చిన విషయం శ్రీమహావిష్ణువు తెలియడంతో ఆయన స్వయంగా ద్వారం దగ్గరకు వచ్చి బ్రహ్మ మానస పుత్రులను లోపలికి పిలుస్తాడు.ద్వారం దగ్గరకు వచ్చిన శ్రీ మహావిష్ణువుకి నమస్కరించిన జయ విజయాలు ఆ మునులు ఇచ్చిన శాపం గురించి చెప్పి శాప విమోచనం కలిగించాలని శరణు కోరుతారు.

అప్పుడు శాప ఫలితం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్నా శ్రీమహావిష్ణువు ఒక పరిష్కారం ఇలా చెబుతాడు.హితువుగా ఏడు జన్మలు భూలోకంలో ఉంటారా, విరోధులుగా మూడు జన్మలు శాప ఫలితాన్ని అనుభవిస్తారా అని ప్రశ్నిస్తాడు.ఎదురుగా అయిన ఏడు జన్మలు మీకు సేవ చేసే అదృష్టానికి దూరంగా ఉండలేం, అన్న జయ విజయాలు విరోధులుగా మూడు జన్మలు కావాలనే అప్పుడు కోరుకుంటారు.ఆ ద్వారా పాలకులే వరుసగా మూడు జన్మల్లో శ్రీమహావిష్ణువుకు విరోధులుగా జన్మిస్తారని పురాణాలలో ఉంది.