Anasuya Pavitra Lokesh: అనసూయకు అంత సీన్ లేదంటూ ఇద్దరు నెటిజన్స్ గొడవలు.. యాంకర్ ఏం చేసిందంటే?

టాలీవుడ్ సినీనటి పవిత్ర లోకేష్ అలాగే యాంకర్ అనసూయ ఇద్దరూ రెండు వేరు వేరు విషయాలపై పై తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఒకవైపు సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అనసూయ.

 Anasuya Shares A Conversation Between Two Guys On Cyber Crime Details, Anasuya,-TeluguStop.com

అయితే తనపై ట్రోల్స్ చేసే వారిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవడంతో పాటు అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతూ వస్తోంది అనసూయ. అయితే కొందరు ఆమె గురించి శృతిమించి అసభ్యకరంగా పోస్ట్లు పెడుతుండడంతో వారిపై చర్యలు తీసుకుంది అనసూయ భరద్వాజ్.

ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోనసీమ అంబేద్కర్ జిల్లాకు చెందిన వీర్రాజు అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

పి రాజు అనే వ్యక్తి యాంకర్ రష్మీ గౌతమ్ విష్ణు ప్రియ ప్రగతి వంటి సెలబ్రిటీలకి సంబంధించిన ఫోటోలను మార్కింగ్ చేయడం వారి గురించి అసభ్యంగా ప్రచారం చేయడం పోస్ట్ లు పెడుతుండడంతో అతన్నీ అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పవిత్ర లోకేష్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో కొంతమంది తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు అంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.పవిత్ర లోకేష్ చేసుకున్న పోలీసులు కొన్ని యూట్యూబ్ ఛానల్ తో పాటు వెబ్సైట్లోపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

Telugu Anasuya, Anasuyapavitra, Pavitra Lokesh, Senior Naresh, Tollywood, Veerra

ఇదిలా ఉంటే తాజాగా ఈ రెండు విషయాలపై సోషల్ మీడియాలో ఇద్దరు నెటిజన్స్ చర్చించుకున్నారు.ఇతరులు ట్రోల్స్ అంత సెన్సిటివా? పవిత్ర లోకేష్ కంప్లైంట్ చేశారట ఏమయింది? అని ఒక నెటిజన్ అడగగా.మరొక నెటిజన్ స్పందిస్తూ పవిత్ర లోకేష్ కంప్లైంట్ ఆధారంగా 8 యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకున్నారు అరెస్టు చేశారంట అని సమాధానం ఇచ్చాడు.దానికి అతను స్పందిస్తూ మార్కింగ్ చేశారని అనసూయ కంప్లైంట్ ఇస్తే కూడా అరెస్టు చేస్తారా అని అడగగా.

వెంటనే మరొక నెటిజెన్ నరేష్ అంటే పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు.కానీ అనసూయకు అంత సీన్ లేదులే అంటూ సమాధానం ఇచ్చాడు.అయితే ట్విట్టర్లో వారి సంభాషణలను చూసినా అనసూయ రీ పోస్ట్ చేస్తూ వారి అమాయకత్వానికి నవ్వు వస్తుంది అంటూ నవ్వుతున్న ఏమోజినీ పోస్ట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube