అయ్యప్ప మండల దీక్ష పూర్తయిన తర్వాత భక్తులలో రావాల్సిన మార్పులు ఇవే..?

ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు కనిపిస్తూ ఉంటారు.41 రోజుల పాటు అత్యంత నియమనిష్ఠలతో భక్తులు దీక్ష చేస్తారు.మండల దీక్ష పూర్తి అయ్యేవరకు కఠిన నియమాలను పాటిస్తారు.ఈ నియమాలలో కేవలం భక్తి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.అయ్యప్ప( Ayyappa Swamy ) మాలదారులు నేలపై నిద్రిస్తారు.41 రోజుల పాటూ ఈ నియమం పాటించడం వల్ల వెన్నునొప్పి తగ్గిపోతుంది.కండరాలు పటిష్టంగా మారుతాయి.రక్తప్రసరణ మెరుగుపడుతుంది.సాధారణంగా చల్లటి నీటితో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 These Are The Changes That Should Come In The Devotees After The Initiation Of-TeluguStop.com
Telugu Ayyappa Deeksha, Ayyappa Swamy, Devotees, Kartika Masam, Kerala, Sabarima

పైగా ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఆ సమయంలో చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.ఇంకా చెప్పాలంటే శ్రద్ధగా పూజ చేయడం వల్ల క్రమశిక్షణ అలవాటు అవుతుంది.సామూహికంగా కలిసి ఉండటం ద్వారా క్రమశిక్షణ మెరుగు పడుతుంది.

నిత్యం రెండు పూటలా దుస్తులను మార్చడం ద్వారా పరిశుభ్రమైన దుస్తులను ధరించడం అలవాటు అవుతుంది.మాలదారులు అధిక ప్రసంగాలకు, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృధా కాదు.

అయితే స్వామి ఆరాధన లేదంటే తమ తమ పనులు పూర్తి చేయడం పై శ్రద్ధ ఉంటుంది.అనవసర చర్చలకు దూరంగా ఉండడం వల్ల మెదడులో మరో ఆలోచన అసలు ఉండదు.

Telugu Ayyappa Deeksha, Ayyappa Swamy, Devotees, Kartika Masam, Kerala, Sabarima

ఫలితంగా మంచి ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది.అయ్యప్ప స్వామి దీక్ష( Ayyappa Deeksha )లో భాగంగా నల్లని వస్త్రాలు ధరిస్తారు.ఎందుకంటే శనీశ్వరునికి నల్లని రంగు అంటే ఎంతో ఇష్టం.పూజలో పాల్గొనే వారి పై శని ప్రభావం ఉండదని కూడా చెబుతున్నారు.అంతేకాకుండా సాధారణంగా అయ్యప్ప మాల శీతాకాలంలో వేస్తారు.ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వేడిని ఇస్తాయి.

అయితే కేవలం 41 రోజుల మండల దీక్షలో ఈ నియమాలన్నీ పాటించిన తర్వాత మళ్లీ మామూలుగా మారిపోవడం కాదు.ఇదే పద్ధతిని కొనసాగించాలన్నదే దీక్ష ఆ ముఖ్య ఉద్దేశం అని పండితులు చెబుతున్నారు.

దీక్షను స్వీకరించడానికి ముందున్న ప్రతికూల ఆలోచనలు, దుర్గుణాలను పూర్తిగా విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube