ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల పుణ్యక్షేత్రానికి( Tirumala ) ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.అలాగే మరి కొంతమంది భక్తులు స్వామి వారికి హుండీ ద్వారా కానుకలను సమర్పిస్తూ ఉంటారు.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి, బయట శిలాతోరణం వరకు క్యూ లైన్ శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం( Venkateswara swamy ) కోసం భక్తులు వేచి చూస్తున్నారు.నడక దారిలో వచ్చిన భక్తులకు స్వామివారి దర్శననికి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.ఈ రోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లో ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శననికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే 300 రూపాయల ప్రత్యక్ష దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శననికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజు శ్రీవారిని దాదాపు 70 వేల మంది భక్తులు ( Devotees )దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.వీరిలో దాదాపు 39 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఆదివారం రోజు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.ఈ రద్దీ ఈ నెల అంతా కొనసాగుతుందని టిటిడి భావిస్తోంది.
అందుకే టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమల కు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.