ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.04
సూర్యాస్తమయం:సాయంత్రం.6.31
రాహుకాలం:ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు:నవమి మంచిది కాదు.
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39
మేషం:

ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది.మీ ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఒక సంఘటన వల్ల మీకు రిలీఫ్ దొరుకుతుంది.కొన్ని విషయాలకు అనుకూలంగా ఉంది.ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు సమయానికి తగ్గట్టుగా పనిచేయడం లో ముందుంటారు.మీ స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా సమస్యలు లేవు.మీ ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉండదు.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం వర్రీ తో మిమ్మల్ని ఆతృత చేస్తుంది.
దీంతో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.దీనివల్ల మీ సమయం ఖర్చు అవుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు అప్పులు చేసి వాటిని తిరిగి ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు.ఈ రోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.ఈరోజు మీకు మీరు చేసే పనులకు అనుకూలంగా ఉంది.
కొన్ని నిజాలు తెలుస్తాయి.మీరు బాగా దగ్గరి వారితో ఫోన్ లో కాలక్షేపం చేస్తారు.
సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉన్నాయి.ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.
తుల:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.వ్యాపార విషయంలో లాభాలు అందుతాయి.
ఒక మంచి శుభవార్త వింటారు.దీనివల్ల ఆనందంగా ఉంటారు.మీరు పనిచేసే చోట మీకు విజయాలు అందుతాయి.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీ సంతాన విషయం లో జాగ్రతలు తీసుకోవాలి.ఇతరులతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది.
ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
మీ ఆవేశం వల్ల ఇతరులతో గొడవలకు దిగుతారు.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
మకరం:

ఈరోజు మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి.అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశాలున్నాయి.మీ కుంటుంబం అంతా ఈరోజు ఆనందంగా గడుపుతారు.
కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు మీకు అన్ని అనుకున్నవి నెరవేరుతాయి.
కుంభం:

ఈరోజు మిమ్మల్ని అనేక కారణాలు బాధించవచ్చు.అలాగే అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలున్నాయి.ఏదైనా పనిని ప్రారంభించడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.మీ తెలివితేటలతో పనిచేస్తే విజయం సాధిస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీకు అదృష్టం మీ దరిచేరుతుంది.అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇతరులు మీరు చేసే పనుల పట్ల అసూయను వ్యక్తం చేస్తారు.
శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంది.వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
DEVOTIONAL