గత కొన్ని రోజులగా భాజపాల్లోకి వలసలు మొదలవుతున్నాయంటూ ఊదర కొట్టిన తెలంగాణా బాజాపా నాయకులు ఇప్పుడు అమిత్ షా( Amit Shah ) పర్యటనతో తమ వాఖ్యలను నిరూపించుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి లో పడ్డారు .ఇప్పటికే రెండుసార్లు బహిరంగ సభ ప్రకటించినప్పటికి అనివార్య కారణాలతో ఆ సభలు వాయిదా పడ్డాయి అయితే ఈ నెల 27న ఖమ్మం కేంద్రంగా సభ కన్ఫర్మ్ అయినందున ఆ సభలో కీలకమైన కొంతమంది నాయకులు చేర్చుకోకపోతే భాజపా నాయకులు ఇంతకాలం చెప్పుకొస్తున్నది అంతా వట్టి బూటకమని తేలిపోతుంది.
అందువల్ల తెలంగాణ భాజపా నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే తమతో టచ్ లో ఉన్న నాయకులతో చర్చలు పూర్తి చేసి అమిత్ షా సభ సందర్భంగా ఘనంగా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే అదికార బారసా లో( BRS party ) టికెట్ దక్కని అసంతృప్తులు తమ పార్టీలోకి వస్తారని వేసిన అంచనాలు విఫలమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .అసంతృప్త నేతలు అందరూ మొదటి ప్రయారిటీగా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు.కాంగ్రెస్ కూడా అటువంటి అభ్యర్థులకు గ్రాండ్ వెల్కమ్ చెపుతుండడంతో భాజపా వైపు చూస్తున్న కీలక నాయకులు ఎవరూ కనపడడం లేదు .మరి 20 నుంచి 30 మంది కీలకమైన ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వైపు చూస్తున్నారని అతి త్వరలో పార్టీలోకి చేరికలు ఉంటాయని పార్టీ చేరికలు కమిటీ కన్వీనర్ ఈటెల రాజేంద్రతోపాటు పార్టీ మారికొంత మంది కీలక నాయకులు ఇప్పటికే అనేక దఫాలుగా ప్రకటించారు.

మరి ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసిన ప్రస్తుత తరుణం లో కూడా చేరికలు వాస్తవ రూపం దాల్చకపోతే తెలంగాణలో భాజాపా మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.అంతేకాకుండా ఇప్పటికే ఖమ్మం( Khammam ) వేదికగా భారతీయ రాష్ట్ర సమితి మరియు కాంగ్రెస్ పార్టీలు భారీ ఎత్తున సభలు నిర్వహించాయి.ఈ రెండు పార్టీలు నిర్వహించిన సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు .మరి క్షేత్రస్థాయిలో అంత బలంగా లేని భాజపా అమిత్ షా సభకు అంతకుమించిన జన సమూహాన్ని సమీకరణ చేయకపోతే పార్టీకి ఊపు రావడం కూడా కష్టమవుతుంది .మరి అత్యంత తక్కువ సమయంలో ఈ రెండుటాస్క్ లను రాష్ట్ర భాజపా నాయకులు ఏ విధంగా పూర్తి చేస్తారో చూడాలి
.