కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం కలిసి రావడం మంచిదేనా..?

ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలోని కార్తీక సోమవారానికి( Kartika Monday ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.నవంబర్ 27వ తేదీన శుక్ల పక్ష పౌర్ణమి తిధి మధ్యాహ్నం రెండు గంటల 46 నిమిషముల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 Is Kartika Purnami Kartika Good To Come Together On Monday , Kartika Purnami, Ka-TeluguStop.com

పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తిక నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి కార్తిక పూర్ణిమ అనే పేరు వచ్చింది.కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం ఆచరించాలని,అలాగే చంద్రునికి చాలా ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి( Kartika Purnami ) అని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది కార్తిక పౌర్ణమి సోమవారం కలిసి రావడం అత్యంత పుణ్యఫలం అని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Kartika Monday, Kartika Purnami, Shiva Worship, Tripu

పురాణాల ప్రకారం త్రిపురాసుర( Tripurasura ) అనే రాక్షసుడి రాక్షసుడి సంహారాన్ని కార్తిక పౌర్ణమి రోజు శివుడు చేశాడని, ఈ రోజున శివారాధన చేయడం వల్ల, జ్వాలాతోరణం వంటివి దర్శించుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఇలా శివుడికి ఇష్టమైనటువంటి కార్తీకమాసంలో సోమవారం రోజు నవంబర్ 27వ తేదీన కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారం కలిసి రావడం శివారాధన ( Shiva worship )చేయడానికి పుణ్యం కలగడానికి అత్యంత విశేషమైనటువంటి రోజు అని పండితులు చెబుతున్నారు.కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్వాలా తోరణం వంటివి జరపడం, దర్శించుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Kartika Monday, Kartika Purnami, Shiva Worship, Tripu

అలాగే ఉపవాసము లేదా నక్తము ఆచరించుట కూడా మంచిదే అని చెబుతున్నారు.దేవాలయంలో లేదా గృహముల నందు తులసి చెట్టు వద్ద ఆవు నేతితో కానీ, నువ్వు నూనెతో కానీ దీపాలు వెలిగించడం ఎంతో మంచిది.కేదారేశ్వర వ్రతం వంటి వ్రతాలను కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాలి.

అలాగే ఈ రోజున పుణ్య నది స్నానాలు చేయాలి.ఈ రోజు శివాలయాలలో నది పరివాహక ప్రాంతాలలో ఇళ్లలో శివరాధన, శివునికి అభిషేకం వంటివి ఆచరించాలి.

ఈ రకంగా కార్తీక పౌర్ణమి రోజు భక్తులు ఆచరిస్తే అటువంటి వారికి శివానుగ్రహం వల్ల పుణ్యము, జ్ఞానము ల ద్వారా మోక్షము కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube