పక్క బాష హీరోల సహాయం లేకుండా మన స్టార్స్ పాన్ ఇండియన్ స్టార్స్ కాలేరా ?

ప్రస్తుతం లెలుగు సినిమా పరిశ్రమలో చాలా సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.అయితే అన్ని భాషల్లో సినిమా మంచి విజయాన్ని అందుకునేలా ఫిల్మ్ మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Tollywood Heros Combination With Other Language Heros, Bollywood Hero Arjun Ramp-TeluguStop.com

అందులో భాగంగానే ఆయా సినిమా పరిశ్రమల్లోని టాప్ హీరోలను పాన్ ఇండియన్ సినిమాల్లో నటించేలా చూసుకుంటున్నారు.ఇక్కడి సినిమాలకు వారి ఇండస్ట్రీలోని మార్కెట్ పెంపొందించుకునేందుకు చాలా ఉపయోగపడుతున్నారు.

తాజాగా ఇతర భాషల నటులు తెలుగు సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

మన సినిమాలను ఇతర రాష్ట్రాలో రిలీజ్ చేసి హిట్ అందుకోవాలంటే.

అక్కడి ఆడియన్స్ కు బాగా రీచ్ కావాలి.అలా కావాలంటే అక్కడ గుర్తింపు పొందిన నటులను ఇక్కడి సినిమాల్లో నటించేలా చూసుకోవాలి.

దాదాపు టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు ఇదే పని చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ కీ రోల్ చేశాడు.

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న గని సినిమాలోనూ బాలీవుడ్ టాప్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నాడు.చిరంజీవి ఆచార్య సినిమాలో బాలీవుడ్ యాక్టర్ జిష్ను సేన్ గుప్తా, కన్నడ యాక్టర్ శౌరవ్ లోకేష్ కీలక పాత్రలు చేస్తున్నారు.

అటు గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించే అవకాశం ఉంది.అటు రాంచరణ్, శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.

ఇతర భాషల నటులు తెలుగులో నటించడం ఎప్పటి నుంచో వస్తుంది.ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వీరి రాక మరింత ఎక్కువైంది.అటు పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ చేస్తున్నాడు.తాజాగా మహేష్, త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ఇతర పరిశ్రమల్లోని టాప్ హీరోలను టాలీవుడ్ లో నటించేలా చేస్తున్నారు.మొత్తంగా సదరు హీరోల మార్కెట్ ను తెలుగు సినిమాలు ఆక్రమించేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube