రామ్ చరణ్( Ram Charan )… తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్( Bollywood ) లో సైతం మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.చిరంజీవికి కేవలం సౌత్ ఇండియాలోనే పాపులారిటీ ఉండేది కానీ అతడి కుమారుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా అతడేంటో ప్రూవ్ చేసుకున్నాడు.
అసలు సినిమాలకే పనికి రాడు అని ట్రోల్ కాబడ్డ రామ్ చరణ్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి పూర్తి కారణం అది స్వయంకృషి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక రామ్ చరణ్ కెరియర్ సెట్ చేయడంలో రాజమౌళి( Rajamouli ) పాత్ర కీలక మని చెప్పాలి అతని సినిమా అయినా మగధీర రామ్ చరణ్ కి మంచి పేరు తీసుకొచ్చింది ఆర్ ఆర్ ఆర్( RRR ) తర్వాత ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పేరు దక్కించుకుందో చెప్పక్కర్లేదు.

1985 మార్చి 27న జన్మించిన రామ్ చరణ్ 37 ఏళ్ల వయసులో ప్రస్తుతం తండ్రి కాబోతున్నాడు.కామినేని ఇంటి వారసురాలు అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్.చిరంజీవి స్కూల్ విద్యాభ్యాసం మొత్తం కూడా చెన్నైలో మరియు హైదరాబాదులో జరిగింది.ఆ తర్వాత పై చదువులు మాత్రం హైదరాబాద్లోనే పూర్తి చేసి ముంబైలో ఫిలిం కోర్స్( Film Course in Mumbai ) పూర్తి చేశాడు.2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ ఇప్పటివరకు 16 సినిమాల్లో నటించాడు.అవే కాకుండా కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ లో కూడా నటించడం విశేషం.
రామ్ చరణ్ చివరగా ఏజెంట్ సినిమాలో కనిపించాడు.

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాల్లలో ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఇప్పటివరకు ఎవరితో పంచుకొని ఒక టాప్ సీక్రెట్ ని పంచుకోవాల్సిందిగా యాంకర్ రామ్ చరణ్ రిక్వెస్ట్ చేసింది.దాంతో కాసేపు తట పటాయించిన రామ్ చరణ్ తాను చిన్నతనంలో చెన్నైలో బాల భవన్, లారెన్స్ అనే రెండు స్కూల్స్ లో చదువుకున్నానని, అప్పటికే నాన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి రావడంతో మిగతా స్కూలింగ్ అంతా కూడా బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశానని, అయితే చెన్నై లో ఒక స్కూల్ నుంచి చిన్న సమస్య వచ్చి సస్పెండ్ అయ్యానని, ఆ విషయం ఇంట్లో చెప్తే తిడతారని భయపడి ఇప్పటివరకు ఎవరితో పంచుకోలేదు అంటూ తన టాప్ సీక్రెట్ బయట పెట్టాడు రామ్ చరణ్.