కుక్కల కోసమే ప్రత్యేకమైన విమానం సంస్థ లాంచ్.. దాని విశేషాలు ఇవే..?
TeluguStop.com
పెంపుడు కుక్కలతో( Pet Dogs ) మన ప్రయాణం చేయాలంటే పెద్ద సమస్య.
దానికి కారణం ప్రయాణం చేసిన సమయంలో అవి ఎక్కడ భయపడుతాయోన్న ఆందోళన వారి యాజమాన్యులకు ఉంటుంది.
దాంతోపాటు విమానా సంస్థ నుండి అనేక రకాల ఆంక్షలు కూడా ఉంటాయి.ఇక ఈ సమస్యలన్నిటికీ చెక్ చెప్పేందుకు బార్క్ ఎయిర్( Bark Air ) అనే సంస్థ సిద్ధమైంది.
ఇందుకోసం ప్రత్యేకంగా పెంపుడు కుక్కల కోసమే విమాన సేవలను మొదలుపెట్టింది.ఈ నేపథ్యంలోనే తాజాగా బార్క్ ఎయిర్ తన తొలి విమానం న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు చేర్చించింది.
ఈ సర్వీస్ సంబంధించి అన్ని టికెట్లు అమ్ముడుపోయినట్లు సంస్థ వెల్లడించింది. """/" /
బార్క్ అనే కంపెనీ శునకాల ఆహారం అలాగే వాటికి సంబంధించిన ఆట బొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంటుంది.
ఇకపోతే తాజాగా ఈ సంస్థ ఓ జెట్ చార్టెడ్ సర్వీస్( Jet Chartered Service ) కంపెనీతో జతకట్టి బార్క్ ఎయిర్ ను మొదలుపెట్టింది.
ఈ సేవలను గత నెలలోనే ప్రకటించింది.ఇలా కేవలం జంతువుల కోసమే ఏర్పడిన రెండో విమాన సంస్థ ఇది.
ఇదివరకు ఇంగ్లాండ్ కు చెందిన కే 9 జెట్స్( K9 Jets ) అనే ఓ ప్రైవేట్ సంస్థ ఈ సేవలను మొదటిసారిగా మొదలుపెట్టింది.
ఇకపోతే తాజాగా బార్క్ ఎయిర్ సంస్థ సునకాల కోసం అనుకూలంగా విమానంలో అన్ని వసతులను ఏర్పాటు చేసింది.
"""/" /
ఈ విమానంలో శునకాలతో పాటి మనుషులు కూడా ప్రయాణం చేయవచ్చు.
కాకపోతే ఏర్పాట్ల విషయంలో మాత్రం మొదటి ప్రాధాన్యత శునకాలకు మాత్రమే.విమానంలో ప్రయాణించాలంటే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి.
ఆ తర్వాత గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి.ఆ తర్వాత చెకింగ్ ప్రాసెస్ అలాగే క్యూలైన్లు, బోర్డింగ్ వంటి హడావిడి లేకుండా విమాన సిబ్బంది అక్కడి నుంచి వారికి సేవలను మొదలుపెడతారు.
ఈ ప్రయాణంలో సునకాలకు ఇరుకుగా ఉండొద్దని ఉద్దేశంతో విమాన సామర్థ్యం మొత్తానికి ఎప్పుడు టికెట్ బుకింగ్ తీసుకోబోమని బార్క్ ఎయిర్ వెల్లడించింది.
మందారం తో మెరిసే చర్మం మీ సొంతం అవ్వాలంటే ఇలా చేయండి!