టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) కెరీర్ పరంగా, క్రేజ్ పరంగా టాప్ లో ఉండగా ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ అప్పన్న అనే పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో చరణ్ సైకిల్ పై అసెంబ్లీకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
సినిమాలో ఇలాంటి సీన్స్ ఉంటే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.సైకిల్ తెలుగుదేశం పార్టీ గుర్తు కావడంతో గేమ్ ఛేంజర్ కథ, కథనం ఎలా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ భార్య పాత్రలో అంజలి( Anjali ) కనిపించనుండగా ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ కావడంతో ఈ విషయాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది.
గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.గేమ్ ఛేంజర్ చరణ్ కెరీర్ లో సోలో హీరోగా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం గమనార్హం.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కియారా అద్వానీ ( Kiara Advani )కాగా చరణ్ కియారా కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన వినయ విధేయ రామ డిజాస్టర్ గా నిలిచింది.అలాంటి సెంటిమెంట్లను పట్టించుకోని రామ్ చరణ్ కియారా అద్వానీకి మరో ఛాన్స్ ఇచ్చారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన జరగండి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన అధికారిక అప్ డేట్స్ కోసం మేకర్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.