ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోని దాదాపు చాలామంది ప్రజలు సంక్రాంతి పండుగను( Sankranti Festival ) తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు.అలాగే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో భోగి ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ప్రతి సంవత్సరం జనవరి నెలలో( January ) సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు.ఈ పండుగ రోజు ఉదయం భోగిమంటలతో ప్రారంభించి, హరిదాసు సంకీర్తనలు, కోడిపందాలు, ముగ్గులు, ముగ్గుల పోటీలు, గంగిరెద్దు విన్యాసాలతో సరికొత్త శోభను సంతరించుకుంటుంది.
అలాగే ఈ రోజునే కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి వస్తారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగి( Bhogi ) పండుగను ప్రజలు అద్భుతంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరంలో భోగి పండుగ 2024 జనవరి 14వ తేదీన వచ్చింది.ముఖ్యంగా చెప్పాలంటే భోగి పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భగ అనే పదం నుంచి ” పుట్టిందని నిపుణులు చెబుతున్నారు.దక్షిణ యానంలో పడ్డ కష్టాలు, బాధలను భోగిమంటల రూపంలో అగ్నిదేవుడికి( Agni Deva ) సమర్పించి రాబోయే ఉత్తరయాన కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు.
ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునండి నిద్రలేచి స్నానం చేసి కొత్త దుస్తులను ధరిస్తారు.ఆ తర్వాత భోగి మంటలు వేసి అందులో పిడకలు, ఇంట్లోనీ పాత వస్తువులు( Old Things ) అగ్నికి ఆహుతి చేస్తారు.ఇలా మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల ప్రత్యేకత అని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే భోగి రోజు బొమ్మల కొలువు చేసి, చిన్న పిల్లల మీద భోగి పళ్ళు పోస్తారు.
ఇలా చేయడం వల్ల పిల్లలు జ్ఞానవంతులు అవుతారని చాలామంది ప్రజలు నమ్ముతారు.