అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్ర పర్వదినం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.అమ్మవారు సరస్వతీ దేవిగా నిజ రూప దర్శనమిస్తుండటంతో భక్తుల తాకిడి పెరుగుతోంది.
ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకుని, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఆలయం తో పాటు ఆలయ పరిసరాలు,గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసి పోతోంది.
రద్దీకి సరిపడా వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.దేవ స్థానం వసతి గృహాలు,కాటేజీలతో పాటు ప్రయివేటు సత్రాలు కూడా నిండి పోయాయి.
తెలుగు రాష్ర్టాల తో పాటు మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి దంపతులు సరస్వతీ, లక్ష్మీ, మహంకాళి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.