భారతీయులు అందరూ పవిత్రంగా పూజించే గ్రంధం భగవద్గీత.సనాతన హిందూ సంప్రదాయాన్ని, మాత్రమే కాదు మానవాళి ఎలా ఉండాలి, దైనందిక జీవితంలో తమ భాద్యతలు ఏంటి, ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఎలాంటి మార్గాలను అనుసరించాలని అనే విషయాలని సుస్పష్టంగా తెలియజేస్తుంది.
అందుకే భగవద్గీత కేవలం భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి దిక్సూచి అయ్యింది.మన ఈ పవిత్ర గీత సారం తెలుసుకున్న దేశాలు భగవద్గీతను గౌరవించుకుంటున్నాయి.
తాజాగా దేశం కాని దేశంలో భారతీయులు అందరూ గర్వించేలా భగవద్గీతకు అరుదైన గౌరవం లభించింది.
కెనడా లోని ఒంటారియా లోని ఫ్రావెన్స్ రాష్ట్రంలో గల బ్రాంప్టన్ నగరంలో బ్రాంప్టన్ ట్రోయర్ పార్క్ ఉంది.
ఈ పార్క్ పేరును ఇప్పుడు శ్రీ భగవద్గీత పార్క్ గా నామకరణం చేశారు.ఈ విషయాన్ని నగర మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ అధికారికంగా ప్రకటించారు.ఈ పార్క్ పేరు మార్పుకు సంభించింది ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ నగరం సర్వ మతాలకు నియలయమని, ఎంతో మంది తమ నగరానికి సేవలు చేశారని అయితే భారతీయులు చేసిన సేవలు అందులో విభిన్నామని కొనియాడారు.
నగరానికి వారు చేసిన సేవలకు గుర్తింపుగా అక్కడి పార్క్ కు భగవద్గీతగా పేరు మార్చినట్టుగా ఆయన వెల్లడించారు.ఇదిలాఉంటే
ఈ పార్క్ విస్తీరణం సుమారు 3.75 ఎకరాలలో విస్తరించి ఉంది, ఈ పార్క్ లో హిందూ దేవతల విగ్రహాలు, శ్రీ కృష్ణుడు, అర్జునుడు విగ్రహాలు ఉన్నాయి.అడుగడుగునా భగవద్గీతార్ధం తెలియజెప్పేలా మరిన్ని విగ్రహాలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కాగా ఈ విషయంపై కెనడాలోని భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.భారతీయులు అందరూ గర్వపడేలా బ్రాంప్టన్ నగర మేయర్ పార్క్ కు భగవద్గీత పేరును పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపాయి కెనడాలోని భారతీయ సంఘాలు.