తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.ఆయనే అన్నాడీఎంకేకు నాయకుడని తీర్పును వెలువరించింది.
దీంతో గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకే నాయకత్వంపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
జులై 11న చేపట్టిన అన్నాడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నిక అయ్యారు.
అయితే ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ లో పళనిస్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ పళనిస్వామికి అనుకూలంగా తీర్పును వెలువరించింది.







