పవన్ పై అలాంటి నిందలు.. నిర్మాతలను ముంచుతున్నాడంటూ ప్రచారం చేస్తూ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

 Producers Fires On Pawan Kalyan Details, Producers, Pawan Kalyan, Tollywood, Set-TeluguStop.com

అయితే సినిమాలతో కంటే ఎక్కువగా రాజకీయాలలోనే కలుపుతున్నాడు పవన్ కళ్యాణ్.అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న నిర్మాతలకు మాత్రం బోలెడు అప్పులను మిగులుస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తీరు నిర్మాతలు ఎలా పోయినా పర్వాలేదు అన్న విధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే నిర్మాతలు అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ ఏమైపోయినా పరవాలేదని కానీ తాను మాత్రం ఒప్పుకున్న సినిమాలకు అడ్వాన్సులు ముందుగానే ఇప్పించుకుని ఆ సినిమాలకు సంబంధించిన విషయాలలో ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా తన పని చేసుకుంటూ వెళుతున్నాడు అంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న ప్రాజెక్టులలో ఇప్పటికే పలువురు నిర్మాతలు నుంచి అడ్వాన్సులు కూడా ఇప్పించుకున్న విషయం తెలిసిందే.ఏం ఏం రత్నం,మైత్రి మూవీస్, రాం తాళ్లూరి, పీపుల్స్ మీడియా అడ్వాన్స్ ఇలా పలమూరు నిర్మాతల దగ్గర బ్యాలెన్స్ దగ్గర ముందుగానే అడ్వాన్స్ ఇప్పించుకున్నాడట.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల విషయం గురించి ఏమాత్రం అప్డేట్ ఇవ్వడం లేదట.ఆ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా కోసం కోట్లు ఖర్చుపెట్టి మరి వేసిన సెట్స్ పాడైపోతున్న కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదట ఇక నగర శివారులోని హరిహర వీర మల్లు సినిమా కోసం వేసిన ఒక స్ట్రీట్ మొత్తం పాడైపోయిందట.

Telugu Pawan Kalya, Ratnam, Harihara, Mytri Makers, Pawan Kalyan, Producers, Set

అలాగే అందులో భాగంగానే ఒక చార్మినార్ లాంటి కట్టడం కూడా వేశారు.అది కూడా మొత్తం పెచ్చులు ఊడిపోయి కేవలం స్ట్రక్చర్ మాత్రమే మిగిలేలా ఉందట.ఆ సెట్ ని మళ్లీ తిరిగి వేయాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుందట.ఈ విషయం పట్ల మాత్రం పవన్ కళ్యాణ్ ఏ మాత్రం స్పందించడం లేదని జగన్ ప్రభుత్వం పై నిత్యం ఏదో ఒక రకంగా ట్వీట్లు వేసే సమయంలో కాస్తయినా వీటి మీద పెడితే ఈపాటికి సినిమాల విషయంలో ఒక క్లారిటీ వచ్చేది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల దిశగానే దూసుకెళ్తున్నాడు.ఈసారి ఎలా అయినా ఎన్నికలలో తానే రాణించాలి అని, ఏపీ సీఎం గా పిలవాలి అని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube