ఆ హీరోయిన్ విషయంలో నిర్మాతను కొట్టిన జగపతి బాబు.. ఏం జరిగిందంటే?

ఒకప్పుడు హీరోగా సత్తా చాటిన జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్నారు.లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన జగపతిబాబు తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారనే సంగతి తెలిసిందే.

 Jagapatibabu Slapped Star Producer Details Here Goes Viral In Social Media , Jag-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి, సినీ జీవితానికి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు.

కెరీర్ తొలినాళ్లలో ఒక నిర్మాతను నేను కొట్టానని ఆయన తెలిపారు.

ప్రముఖ హీరోయిన్ విషయంలో నిర్మాత తప్పు చేస్తే నిర్మాతను కొట్టానని జగపతి బాబు తెలిపారు.ఆ నిర్మాత ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఉన్నారని జగపతి బాబు కామెంట్లు చేశారు.

అవకాశాల కోసం మనసు చంపుకోవద్దని ఆయన వెల్లడించడం గమనార్హం.సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలని ఉందని జగపతి బాబు వెల్లడించారు.

Telugu Godfather, Jagapatibabu, Legend, Tollywood, Villain-Movie

టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలలో ఇతర పాత్రలు కూడా బలమైన పాత్రలు ఉండాలని కోరుకున్నారని జగపతి బాబు పేర్కొన్నారు.కొన్ని సినిమాలలో ఇతర పాత్రలు బాగుంటే సినిమాలు క్లిక్ అవుతాయని ఆయన తెలిపారు.గాడ్ ఫాదర్ రోల్ లో నటించాలని ఉందని జగపతి బాబు చెప్పుకొచ్చారు.సర్కార్ తరహా సినిమాలో నటించాలని నేను భావిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Godfather, Jagapatibabu, Legend, Tollywood, Villain-Movie

తనకు మంచి అల్లుడు దొరికాడని నా అల్లుడు కూతురిని బాగా చూసుకుంటాడని ఆయన కామెంట్లు చేశారు.లైఫ్ లో ఏం కావాలనే ప్రశ్నకు నాకు కావాల్సిన వాళ్లంతా బ్రతికుండాలని కామెంట్లు చేశారు.జగపతిబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.నటుడిగా జగపతిబాబు స్థాయి అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube