చిరుతో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ప్లాన్ చేస్తారు కానీ కొందరికే ఆ లక్కీ ఛాన్స్ వస్తుంది.అయితే కొన్నాళ్లుగా మెగాస్టార్ తో సినిమా ప్రయత్నిస్తున్నా ఒక డైరెక్టర్ కి వర్క్ అవుట్ అవ్వట్లేదు.
అందుకే అతను కొద్దిగా గ్యాప్ తీసుకుని వేరే వాళ్లతో సినిమాలు చేస్తూ వచ్చారు.లేటెస్ట్ గా చిరు సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేసిన ఆ డైరెక్టర్ ఆ సందర్భంలో అతనితో సినిమాని లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరన్నది మీరు ఈపాటికే గెస్ చేశారు అనుకుంటా.అవును అతనే పూరీ జగన్నాథ్.
లైగర్ తర్వాత పూరీతో సినిమా అంటే ఎవరు సాహసం చేయట్లేదు.కానీ చిరు మాత్రం అందుకు సై అంటున్నారని తెలుస్తుంది.
మెగాస్టార్ కోసం ఒకప్పుడు ఆటో జానీ కథ రాసుకున్న పూరీ ఆ మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ నచ్చలేదని చెప్పారు.ఇక ఈమధ్య గాడ్ ఫాదర్ కోసం పూరీ పనిచేయగా ఆ టైం లో చిరుకి ఒక లైన్ చెప్పాడట పూరీ.
లైన్ ఆసక్తికరంగా ఉండటంతో పూరీని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నాడట.అలా ఫైనల్ గా పూరీ చిరు కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తుంది.మరి ఆటో జానీ అనుకున్న ఈ కాంబో ఎలాంటి సినిమాతో వస్తుందో చూడాలి.