రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం( Vemulawada Constituency ) కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు రామాంజనేయులు బంధువులు సంజన ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని, అలాగే గడ్డం గంగాధర్ తల్లి గడ్డం గంగు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని, అలాగే మ్యాదరి బాబు అనే వ్యక్తికి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహారావు( Chalmeda Lakshmi Narasimha Rao ) పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.వారి వెంట ఎంపీటీసీ జలంధర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ నరేష్, మాజీ ఎంపీటీసీ రవి, శ్రీధర్ నాయకులు సాయన్న, నరసయ్య, దశ గౌడ్, ముజీబ్, కిషోర్, రవీందర్, కిరణ్, లింబాద్రి, తదితరులు ఉన్నారు.







