Fatigue Recovery Smoothie : చిన్న చిన్న పనుల‌కు కూడా అల‌సిపోతున్నారా? అయితే ఈ స్మూతీ మీకోసమే!

అలసట.సర్వ సాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

 Best Smoothie To Get Rid Of Fatigue, Best Smoothie, Fatigue, Fatigue Recovery Sm-TeluguStop.com

శ్రమకు మించి పని చేయడం, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు తదితర అంశాలు అలసటకు కారణాలు అవుతుంటాయి.అయితే కొందరు చిన్న చిన్న పనుల‌కు కూడా తీవ్రంగా అలసిపోతుంటారు.

కాస్త పెద్ద పనులు ఉన్నాయంటే ఇక అంతే సంగతులు.మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్స‌లు వర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని డైట్ లో చేర్చుకుంటే అలసట అన్నమాట.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి ప‌ల్చ‌టి వస్త్రం సహాయంతో కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి.

మ‌రోవైపు ఒక గిన్నెలో చిన్న కప్పు వాటర్ పోసి పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసి నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక అరటి పండును తీసుకుని పీల్‌ తొలగించే స్రైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు, నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న ఎనిమిది పిస్తా పప్పులు, రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసుకోవాలి.

Telugu Smoothie, Fatigue, Fatiguerecovery, Tips, Latest-Telugu Health Tips

చివరగా నానబెట్టుకున్న కుంకుమపువ్వు వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్దం అవుతుంది.ఈ స్మూతీ టేస్టీగా ఉండ‌డ‌మే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే అలసట, నీరసం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

రక్తహీనత, బలహీనత వంటివి దూరం అవుతాయి.ఎముకలు దృఢంగా మారతాయి.

సన్నగా పీలగా ఉన్నవారు హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు.మరియు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube