టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ( Ram Charan )గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
చెర్రీ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించడంతో పాటు ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.చెర్రీ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్థాపించి నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారు.

భారతదేశంలోని అత్యంత సంపన్న హీరోలలో ఒకరిగా చరణ్ పేరు రికార్డుల్లో ఉంది.అయితే అతడు అతిపెద్ద సంస్థానాలు కలిగి ఉన్న కామినేని ఇంటి అల్లుడు అన్న సంగతి తెలిసిందే.చరణ్ జీవిత భాగస్వామి ఉపాసన కామినేని ఆస్తి ఐశ్వర్యం గురించి తరచుగా అభిమానుల్లో చర్చ సాగుతుంటుంది.ఉపాసన గురించి కూడా మనందరికీ తెలిసిందే.ఉపాసన కేవలం చరణ్‌కి భార్య మాత్రమే కాదు, అపోలో గ్రూప్స్ ( Apollo Groups )సామ్రాజ్యంలో కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న మేటి ఎంటర్‌ప్రెన్యూర్.అపోలో గ్రూప్స్ టర్నోవర్ నేడు 77,000 కోట్లు పైబడి ఉంది.
ఇంతటి విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసుల్లో ఆమె ఒకరు.

కామినేని వంశం హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో అనుబంధం కలిగి ఉంది.ఉపాసన( Upasana ) తల్లి శోభనా కామినేని గ్రూప్ నాయకుల్లో ఒకరు.
ఉపాసన వివిధ విభాగాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.తన కుటుంబ సంబంధాలకు అతీతంగా, ఉపాసన కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.
అపోలో హాస్పిటల్స్ CSR విభాగంలో వైస్ చైర్మన్, FHPL మేనేజింగ్ డైరెక్టర్, UR.Life, సంపూర్ణ వెల్నెస్ ప్లాట్‌ఫారమ్ వెనుక ఉన్న దూరదృష్టి ఉపాసన.అలాగే KEI గ్రూప్ వ్యవస్థాపకుడైన తన తండ్రి ప్రభావం ఉపాసన వ్యవస్థాపక స్ఫూర్తిని మరింత మెరుగుపరుస్తుంది.ఇకపోతే ఇంతటి బ్యాగ్రౌండ్ కలిగి ఉన్న ఉపాసనకు భారీగానే ఆస్తులు ఉన్నాయి.
అటు రామ్ చరణ్ కూడా సినిమాల ద్వారా బాగానే సంపాదించారు.అలా వీరిద్దరూ దాదాపు 2500 కోట్ల వరకు నికర ఆస్తులను కలిగి ఉండాలని సమాచారం.మెగా నటవారసుడైన రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ రూ.1,370 కోట్లు కాగా, ఉపాసన సంపద సుమారు రూ.1,130 కోట్లుగా ఉందని అంచనా.ఈ రెండిటినీ కలిపితే సుమారు 2500 కోట్ల ఆస్తిపరులు.
దేశంలోని సంపన్న సెలబ్రిటీ కపుల్స్ లో వారి పేరు కూడా ఉంది.