పుష్ప ది రైజ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఫహద్ ఫాజిల్ (fahad fassil )మంచి పేరును సంపాదించుకున్నారు.తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ ఫాజిల్(fahad fassil) షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.41 సంవత్సరాల వయస్సులో తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ ఫాజిల్ అన్నారు.ఆ వ్యాధి చికిత్స గురించి డాక్టర్లను అడిగానని ఫహద్ ఫాజిల్ కామెంట్లు చేశారు.
ఆ వ్యాధి పేరు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్(Attention Deficit Hyperactivity Disorder) అని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు.మెదడు పనితీరు విషయంలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.ఈ వ్యాధి శ్రద్ధ, ప్రేరణ, ప్రవర్తన నియంత్రణను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు.ఈ వ్యాధి పిల్లల్లో సాధారణమే అని పెద్దల్లో మాత్రం అరుదుగా వస్తుందని ఆయన తెలిపారు.
ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులలో పని విషయంలో శ్రద్ధ ఉండదు.ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులు ఇప్పటికే మొదలుపెట్టిన పనులను పూర్తి చేయకముందే కొత్త పనులను మొదలుపెడతారు.
ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు దేనిపై కూడా ఫోకస్ పెట్టలేరు.ఈ వ్యాధి బారిన పడిన వాళ్లను మతిమరపు సమస్య కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం ఆవేశం సినిమాతో ఫహద్ ఫాజిల్ భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం పుష్ప ది రూల్ (Pushpa The Rule)సినిమాలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన రిలీజ్ కానుంది.ఫహద్ ఫాజిల్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.