అరుదైన వ్యాధి బారిన పడిన పుష్ప విలన్.. ఈ వ్యాధి లక్షణాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

పుష్ప ది రైజ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఫహద్ ఫాజిల్ (fahad Fassil )మంచి పేరును సంపాదించుకున్నారు.

తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ ఫాజిల్(fahad Fassil) షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

41 సంవత్సరాల వయస్సులో తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ ఫాజిల్ అన్నారు.

ఆ వ్యాధి చికిత్స గురించి డాక్టర్లను అడిగానని ఫహద్ ఫాజిల్ కామెంట్లు చేశారు.

"""/" / ఆ వ్యాధి పేరు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్(Attention Deficit Hyperactivity Disorder) అని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు.

మెదడు పనితీరు విషయంలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

ఈ వ్యాధి శ్రద్ధ, ప్రేరణ, ప్రవర్తన నియంత్రణను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు.

ఈ వ్యాధి పిల్లల్లో సాధారణమే అని పెద్దల్లో మాత్రం అరుదుగా వస్తుందని ఆయన తెలిపారు.

ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులలో పని విషయంలో శ్రద్ధ ఉండదు.ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులు ఇప్పటికే మొదలుపెట్టిన పనులను పూర్తి చేయకముందే కొత్త పనులను మొదలుపెడతారు.

ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు దేనిపై కూడా ఫోకస్ పెట్టలేరు.ఈ వ్యాధి బారిన పడిన వాళ్లను మతిమరపు సమస్య కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

"""/" / కొన్నిరోజుల క్రితం ఆవేశం సినిమాతో ఫహద్ ఫాజిల్ భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం పుష్ప ది రూల్ (Pushpa The Rule)సినిమాలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన రిలీజ్ కానుంది.

ఫహద్ ఫాజిల్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!