జూన్ 4వ తేదీన ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏంటో తేలిపోనుంది.ఎవరు అధికారంలోకి వస్తారు అనేది క్లారిటీ రానుంది.
టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి కచ్చితంగా తాము అధికారం చేపడతామనే ధీమాను వ్యక్తం చేస్తుండగా, వైసీపీ కూడా రెండోసారి తాము అధికారంలోకి వస్తామని , తాము అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ఉంది.జూన్ ఒకటో తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పైన నిషేధం ఉండడం తో, ఏ పార్టీ కచ్చితంగా అధికారం చేపడుతుందో ముందుగా అంచనా వేయలేని పరిస్థితి.
ఇది ఇలా ఉంటే ఒకవైపు కూటమి పార్టీలు, మరోవైపు వైసీపీ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.ఈ విషయంలో వైసిపి దూకుడుగా ఉంది.
జూన్ 9వ తేదీన విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేసేందుకు ముదుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.కచ్చితంగా 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే మెజార్టీ సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వస్తామని వైసిపి నేతలు పదేపదే ప్రకటనలు చేస్తుండగా, టిడిపి మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉంది.
టిడిపి నేతలు ఎవరు ఈ విషయంలో స్పందించడం లేదు.దీంతో అసలు టిడిపి లో గెలుపు ధీమా ఉందా లేదా ? ఉన్నా.వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారా అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.పార్టీ అధినేత నుంచి కిందిస్థాయి నాయకులు వరకు ఎవరు ఈ విషయంలో నోరు మెదపడం లేదు.
దీంతో టిడిపి క్యాడర్ అయోమయంలో ఉంది.పోలింగ్ జరిగి రెండు వారాలు గడిచినా, పార్టీ నేతల్లో గతంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించకపోవడం వెనుక కారణాలు తెలియడం లేదు.
పోలింగ్ కు ముందు వరకు ఏపీలో అధికారంలోకి వచ్చేది మనమే అంటూ .టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నించారు.
ఎన్నికల ముగిసిన తరువాత వైసిపి తామే గెలవబోతున్నామంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్నా.టిడిపి అగ్రనేతలు సైలెంట్ గా ఉండడం, క్యాడర్ కు కూడా అంతు పట్టడం లేదు.గతంలో ఎన్నికల తంతు ముగిసిన తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై చంద్రబాబు స్పందించేవారు.కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు.ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) నామినేషన్ సమయంలో వారణాసి వెళ్లిన సందర్భంలో ఇంగ్లీష్ ఛానల్ తో మాట్లాడారు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పారు.ఆ తర్వాత ఎక్కడా గెలుపు పై చంద్రబాబు స్పందించలేదు.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఆయన ఉన్నారు .టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) తో పాటు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు సైతం గెలుపు పై ఎక్కడా ప్రకటనలు చేయడం లేదు.అధికారంలోకి వచ్చే సమయంలో అనవసర ప్రకటనలు ఎందుకని టిడిపి నేతలు మౌనంగా ఉంటున్నారట.తమకు అందిన నివేదికలు సర్వేల ప్రకారం టిడిపి కూటమికి మంచి స్థానాలు వస్తున్నాయని పార్టీ ముఖ్య నేతలకు సమాచారం ఇస్తున్నారట.
కానీ ఎక్కడ గెలుపు పై బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచిస్తున్నారట.