యూకే : ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ

బ్రిటన్‌కు చెందిన భారత సంతతి పార్లమెంట్ సభ్యుడు , లేబర్ పార్టీ నేత వీరేంద్ర శర్మ( Virendra Sharma ) సంచలన ప్రకటన చేశారు.ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో పాటు జూలై 4న జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తన నిర్ణయాన్ని ప్రకటించారు.77 ఏళ్ల వీరేంద్ర శర్మ .2007లో జరిగిన ఉప ఎన్నికల్లో పంజాబీ ఆధిపత్యం ఉన్న ఈలింగ్ సౌత్ నియోజకవర్గంలో విజయం సాధించారు.ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు అక్కడి నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.తాజాగా తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి ఇది సరైన సమయంగా వీరేంద్ర శర్మ వ్యాఖ్యానించారు.

 Veteran British Indian Labour Mp Virendra Sharma Says Won't Seek Re-election ,-TeluguStop.com
Telugu India Uk, Mandhali, Punjab, Veteranbritish, Virendra Sharma-Telugu NRI

భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం మంధాలీ గ్రామం( Mandhali )లో జన్మించిన వీరేంద్ర శర్మ.1968లో యూకేకు వెళ్లారు.ట్రేడ్ యూనియన్ స్కాలర్‌షిప్‌పై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఈ)లో చదువుకోవడానికి ముందు బస్ కండక్టర్‌గా పనిచేశారు.అనంతరం ట్రేడ్ యూనియన్ వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు.బ్రిటీష్ ఇండియన్‌గా, హిందువుగా, లేబర్ మెంబర్‌గా, కౌన్సిలర్‌గా, ఎంపీగా తాను భిన్నమైన విధులు నిర్వర్తించానని సోమవారం సాయంత్రం తన పార్టీకి రాసిన లేఖలో వీరేంద్ర అన్నారు.

Telugu India Uk, Mandhali, Punjab, Veteranbritish, Virendra Sharma-Telugu NRI

దాదాపు 50 ఏళ్లకు పైగా తాను పార్టీకి ఏదో ఒక రూపంలో సేవ చేస్తూనే ఉన్నానని ఆయన చెప్పారు.ఇప్పుడు జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించే సమయం ఆసన్నమైందన్నారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూదడని మీకు తెలియజేయాలనుకుంటున్నానని శర్మ సదరు లేఖలో పేర్కొన్నారు.

లేబర్ పార్టీ ( Labour Party )ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ఆకాంక్షించారు.లేబర్ పార్టీకి తన మద్ధతు కొనసాగుతూనే ఉంటుందని, లేబర్ ప్రాజెక్ట్‌లలో భాగంగానే ఉంటానని .కానీ అది హౌస్ ఆఫ్ కామన్స్( House of Commons ) లోపల కాదని వీరేంద్ర శర్మ అన్నారు.ఇండో – బ్రిటీష్ ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ (ఏపీపీజీ)కి ఛైర్మన్‌గా, బ్రిటీష్ హిందూస్ ఏపీపీజీ సహ అధ్యక్షుడిగా ఉన్న శర్మ.

ఏళ్లుగా భారత్ – యూకే సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేశారు.ఇన్నేళ్లుగా తనకు అండగా నిలిచిన భార్య నిర్మలకు వీరేంద్ర శర్మ కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube