సినిమా కోసం నటీనటులు ప్రాణం పెట్టి పనిచేసే పరిస్థితులు చాలాసార్లు వస్తుంటాయి.కొంతమంది అయితే ప్రాణం పోయినా సరే నటించినా పాత్రకు న్యాయం చేయాలి అని అనుకుంటారు.
అలా ఆ పాత్ర వారి కెరియర్ లో పెద్ద సినిమాగా మిగిలిపోవాలని కలలు కంటూ ఉంటారు అందుకోసం ఎంత కష్టమైనా సరే చేయడానికి ఒప్పుకుంటారు.కానీ అవి సరైన ఫలితాలను ఇవ్వక పోతేనే గుండె ఆగిపోయినంత బాధ ఉంటుంది.
అయినా సరే మరో మరొ ప్రయోగాత్మక పాత్ర కోసం హీరోలు రెడీ గానే ఉంటారు.ఇంతకి తమ కెరియర్ లో ఏ హీరో కూడా చేయనటువంటి రిస్క్ చేసిన ఆ హీరోలు ఎవరు ? వారు చేసిన పాత్రలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఏకైక హీరో విక్రమ్.( Hero Vikram ) ఆయన సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఈసారి ఇలాంటి కొత్త లుక్ ట్రై చేశాడు అని ఎదురు చూస్తూ ఉంటారు.అపరిచితుడు లాంటి సినిమా మంచి విజయం అయితే సాధించింది కానీ ఆయన కెరియర్ లో అత్యంత కష్టమైనా క్లిష్టమైన సినిమా ‘ ఐ ‘.( I Movie ) ఈ సినిమా కోసం ఏ హీరో కూడా మౌల్డ్ అవ్వలేనంత భయంకరంగా శరీరాన్ని కష్టపెట్టాడు విక్రమ్.
నిజానికి ఈ సినిమాలో మూడు పాత్రలు ఉంటాయి ఒక పాత్ర కోసం 90 కేజీల వరకు వెయిట్ పెరిగాడు.అలాగే వైరస్ ఇన్ఫెక్షన్ అయిన మరొక పాత్ర కోసం 45 కేజీల బరువు తగ్గాడు.
ఇక చివరిగా బీస్ట్ పాత్ర కోసం 120 కేజీల వరకు బరువు పెరిగాడు.ఇక రెండవ పాత్ర కోసం ఏకంగా పళ్ళు కూడా పీకించుకున్నాడు.అయినా ఈ సినిమా పరాజయం పాలవడంతో ఆయన కష్టం బూడిదలో పోసినట్టు అయింది.

మరో తమిళ యాక్టర్ శ్యామ్( Shaam ) కూడా తానే మీ తక్కువ తినలేదు అన్నట్టుగా ఒక పాత్ర కోసం ఏకంగా 17 కేజీల బరువు తగ్గారు.అలాగే ఆ పాత్రలో కళ్ల కింద వాచిపోయి ఉండడం కోసం ఏకంగా పది రోజుల పాటు నిద్రపోకుండా ఉన్నారట.మరో ఐదు రోజుల పాటు ఆ సీన్ పూర్తయిన తర్వాత వాపు తగ్గి మునపటి లుక్ కి వచ్చారట.
ఇక అల్లరి నరేష్( Allari Naresh ) కూడా కెరియర్ లో ఇలాంటి ఒక రిస్క్ చేశారు.లడ్డు బాబు సినిమా( Laddu Babu ) కోసం ఒక ఫ్యాట్ లుక్ సూట్ రెడీ చేశారట సినిమా మేకర్స్.
అయితే ఆ సూట్ లో ఆయన నటించడం కోసం చాలా కష్టపడ్డారట.ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేకపోయారట. సరిగా భోజనం కూడా చేయడానికి ఇబ్బంది పడ్డారట.ఇంత కష్టపడి సినిమా తీస్తే తీరా అది పరాజయం చవిచూసింది.







