మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) అజ్ఞాతాన్ని వీడారు.మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో( SP Office ) సంతకం చేసి వెళ్లారు.
ఏపీ ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కేసుతో సహా మూడు కేసులు నమోదు కాక ఆయన హైకోర్టులో బెయిల్ పిటీషన్లు వేశారు.దీంతో పిన్నెల్లి పై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులకు సూచించింది.
ఇదే సమయంలో నిత్యం ఎస్పీ ఆఫీస్ లో సంతకం చేయాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎస్పీ ఆఫీసులో సంతకం చేసి వెళ్లారు.
ఈసారి ఏపీ ఎన్నికలలో పల్నాడులో( Palnadu ) భారీగా గొడవలు చోటు చేసుకున్నాయి.
తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.బాంబులు కూడా విసురుకున్నారు.ఈ దాడులలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు.
గాయాలు కూడా అయ్యాయి.అయితే ఓ పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం నేతలు( TDP Leaders ) రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని.
అక్కడికి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.ఈవీఎం( EVM ) ధ్వంసం చేయటం.
ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో… కేసు నమోదు కావడం జరిగింది.దీంతో కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.