మేజర్ రాధికా సేన్‌కు అరుదైన గౌరవం .. ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

ఆఫ్రికా దేశం కాంగోలో( Congo ) ఐక్యరాజ్యసమితి మిషన్‌తో పనిచేసిన భారతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్‌కు( Major Radhika Sen ) ప్రతిష్టాత్మక ‘ మిలటరీ జెండర్ అడ్వకేట్ ’’ అవార్డు( Military Gender Advocate Award ) దక్కింది.ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్( Antonio Guterres ) ఆమెను నిజమైన నాయకురాలు, రోల్ మోడల్‌గా అభివర్ణించారు.

 Major Radhika Sen Of India To Receive Prestigious 2023 Un Military Gender Advoca-TeluguStop.com

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (MONUSCO)లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మిషన్‌లో పనిచేశారు రాధిక.ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో గుటెర్రెస్ చేతుల మీదుగా రాధిక ‘2023 United Nations Military Gender Advocate of the Year Award’ను అందుకోనున్నారు.

మే 30న యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం కావడం విశేషం.

మార్చి 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ) తూర్పు ప్రాంతంలో ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్ (ఐఎన్‌డీఆర్‌డీబీ) తరపున ఎంఎన్‌యూఎస్సీవో ప్లాటూన్ కమాండర్‌గా రాధిక పనిచేశారు.1993లో హిమాచల్‌ప్రదేశ్‌లో జన్మించిన ఆమె ఎనిమిదేళ్ల క్రితం భారత సైన్యంలో చేరారు.బయోటెక్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైన రాధిక .ఐఐటీ బాంబే నుంచి మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న సమయంలో భారత సైనిక దళాలలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Telugu Unmilitary, Antonio, Congo, India, Radhika Sen, Suman Gawani, Radhikasen,

ఇండియన్ ర్యాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్‌మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా మార్చి 2023లో ఎంఎన్‌యూఎస్సీవో‌కు మోహరించబడ్డారు.ఏప్రిల్ 2024న అక్కడ ఆమె తన పదవీకాలాన్ని పూర్తి చేశారు.సౌత్ సూడాన్‌లోని యూఎన్ మిషన్‌లో (యూఎన్ఎంఐఎస్ఎస్) పనిచేసిన రాధికను ‘‘ 2019 United Nations Military Gender Advocate of the Year Award ’’ సత్కరించారు.

మేజర్ సుమన్ గవానీ( Major Suman Gawani ) తర్వాత ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్.

Telugu Unmilitary, Antonio, Congo, India, Radhika Sen, Suman Gawani, Radhikasen,

నార్త్ కివ్‌లో పెరుగుతున్న సంఘర్షణ వాతావరణం నేపథ్యంలో రాధిక నేతృత్వంలోని దళాలు .మహిళలు , బాలికలకు అండగా నిలుస్తున్నాయని గుటెర్రెస్ అన్నారు.వినయం, కరుణ, అంకితభావంతో వారి నమ్మకాన్ని రాధిక సంపాదించుకున్నారని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube