జబర్దస్త్ కార్యక్రమానికి కన్నీటి వీడ్కోలు చెప్పిన ఇంద్రజ.. అదే కారణమా?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

 Actress Indraja Good Bye To Jabardasth Show Details,indraja,jabardasth,roja,judg-TeluguStop.com

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లు మాత్రమే కాకుండా జడ్జ్ లు కూడా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు,రోజా వంటి వారు జడ్జిలుగా వ్యవహరించారు.

అయితే కొన్ని కారణాల వల్ల వీటిని కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి రోజా( Roja ) గుడ్ బై చెప్పడంతో ఆమె స్థానంలో ఇంద్రజ( Indraja ) వచ్చారు.ఇక రోజా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆమె ఎప్పుడు తిరిగి వచ్చినా ఈ సీటు ఖాళీ చేస్తానని గతంలో ఇంద్రజ వెల్లడించారు.అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇంద్రజ కన్నీటి వీడ్కోలు చెప్పారని తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి ఉన్న ఫలంగా ఇంద్రజ దూరం కావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తెలియడం లేదు కానీ ఈ కార్యక్రమానికి తాను కాస్త విరామం ఇవ్వబోతున్నానని ఈమె తెలియజేసారు.అయితే ఇంద్రజ ఈ కార్యక్రమం నుంచి దూరం కావడానికి రోజానే కారణమా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.రోజా తిరిగి ఈ కార్యక్రమానికి రాబోతున్నారా ఆమె కోసమే తన సీటు ఖాళీ చేస్తున్నారా అన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.రోజా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమంలో కొనసాగారు కానీ ఆమెకు మంత్రి పదవి రావడంతో మంత్రిగా తనకు మరికొన్ని బాధ్యతలు పెరుగాయని అందుకే ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube