ఈ రోజుల్లో పైకి ఆరోగ్యంగా కనిపించినా హార్ట్ ఎటాక్స్( Heart Attack ) వచ్చి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.హార్ట్ ఎటాక్స్ సామాన్య ప్రజలనే కాదు సెలబ్రిటీల ప్రాణాలను కూడా సైలెంట్ గా వచ్చి వారి తీసేస్తున్నాయి.
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తారకరత్న ఎంత చిన్న వయసులో చనిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటే ఈ సమస్య కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది.
గుండె జబ్బులతో చాలామంది కన్నడ సినీ తారలు( Kannada Actors ) కన్నుమూసి తీరని శ్లోకాన్ని మిగిల్చారు.ఎంతో ఉజ్వల భవిష్యత్తు పునీత్ రాజ్‌కుమార్ నుంచి అంబరీష్ వరకు చాలామంది కన్నడ సినీ ప్రముఖులు గుండెపోటుతో మరణించారు.
వారి మరణాలు ప్రేక్షకుల గుండెల్ని పిండేసాయి.వారెవరో తెలుసుకుందాం.

• శంకర్ నాగ్ (1954-1990):
శంకర్ నాగ్( Shankar Nag ) కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత.అతను 36 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

• విష్ణువర్ధన్ (1950-2009):
కన్నడ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో విష్ణువర్ధన్( Vishnuvardhan ) ఒకరు.అతను 59 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

• జయప్రకాష్ రెడ్డి (1958-2020):
జయప్రకాష్ రెడ్డి( Jayaprakash Reddy ) కన్నడ, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు.అతను 74 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

• అంబరీష్ (1952-2018):
అంబరీష్( Ambareesh ) కర్ణాటకలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, మంత్రి. అతను 66 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

• పునీత్ రాజ్‌కుమార్ (1975-2021):
కన్నడ సినిమాల్లో పాపులర్ హీరోల్లో పునీత్ రాజ్‌కుమార్( Puneeth Raj Kumar ) ఒకరు.అతను 46 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

• కన్నడ నటుడు నితిన్ గోపి:
కన్నడ నటుడు నితిన్ గోపి (39)( Nithin Gopi ) 2023, జూన్ 2న గుండెపోటుతో కన్నుమూశారు.బెంగుళూరులోని తన ఇంట్లో ఛాతి నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేదు.నితిన్ గోపి కన్నడ సినిమాలు, టెలివిజన్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యాడు.

• కన్నడ నటుడు దిగంత్ భార్య స్పందన( Spandana ) గుండెపోటుతో మరణించారు.ఆమె వయస్సు 44 సంవత్సరాలు.స్పందన ఒక గృహిణి, దిగంత్‌తో కలిసి ఇద్దరు పిల్లలు కన్నది.
ఆమె మరణవార్త కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురయ్యారు.