వచ్చే ఎన్నికలలో నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అనకాపల్లి వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల ఫలితాలు( 2024 Elections Results ) ఇంకా రాలేదు.ఈ ఎన్నికల ఫలితాలు కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Mla Candidate In Next Election Anakapalli Ycp Leader Key Comments Details, Ap El-TeluguStop.com

ఈసారి 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదయింది.రూరల్ మరియు మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారు.

ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన ప్రధానంగా వైసీపీ…టీడీపీ కూటమి మధ్య పోటీ నెలకొంది.పరిస్థితి ఇలా ఉండగా వచ్చే ఎన్నికలలో తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ అనకాపల్లిలో వైసీపీ నేత( Anakapalli YCP leader ) తాజాగా ప్రకటించుకున్నారు.2029లోనూ తానే అభ్యర్థిని అంటూ అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ స్వయంగా ప్రకటించుకున్నారు.

మంగళవారం అనకాపల్లి జిల్లాలో మండల స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలకి సంబంధించి మాట్లాడుతూ…ఈ ఎలక్షన్ లో గెలిచేసామనుకోండి.అది మైండ్ లో నుంచి తీసేయండి.2029లోనూ తానే అభ్యర్థిని.మళ్లీ వచ్చి జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎంత మెజారిటీ తెచ్చుకోవాలన్న దానిపై ఇప్పటినుండే నేను ఆలోచిస్తున్నా.మీరు ఆలోచించండి మళ్లీ నేనే అభ్యర్థిని.ఈ సహకారం నాకు ఎంతో అవసరం… అంటూ అనకాపల్లి జిల్లా వైసీపీ మండల స్థాయి నాయకుల సమావేశంలో మలసాల భరత్( Malasala Bharath ) కామెంట్లు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube