హీరోయిన్ రష్మిక ఫేవరెట్ ప్లేస్ ఇదేనట.. నా ఫేవరెట్ హీరో మాత్రం అతనేనంటూ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) గురించి మనందరికీ తెలిసిందే.బేబీ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

 Rashmika At Gam Gam Ganesha Pre Release Event Details, Rashmika , Gam Gam Ganesh-TeluguStop.com

అందులో భాగంగానే ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం గం గం గణేశా.( Gam Gam Ganesha Movie ) ఈ సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు.

ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్ లుగా నటించారు.ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Gam Gam Ganesha, Gamgam, Rashmika-Movie

ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించింది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు.ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ రష్మికను అందరి ముందు పలు ప్రశ్నలు వేసి అడ్డంగా బుక్ చేశారు.మరి ఆనంద్ దేవరకొండ ఎటువంటి ప్రశ్నలు వేశారు రష్మిక ఎలాంటి సమాధానం ఇచ్చింది అన్న వివరాల్లోకి వెళితే.

మీకు బాగా ఇష్టమైన టూరిస్ట్‌ ప్లేస్‌? ఏది అని ఆనంద్ అడగగా.రష్మిక స్పందిస్తూ వియత్నం( Vietnam ) అని తెలిపింది.

ఆ తరువాత మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్‌ ఎవరు? అని ప్రశ్నించగా రష్మిక స్పందిస్తూ.

Telugu Gam Gam Ganesha, Gamgam, Rashmika-Movie

నీ యబ్బ అనే నెమ్మదిగా అంటూనే ఆనంద్‌.నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే ఫేవరెట్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అని తెలిపింది రష్మిక.ఆమె మాటలకు వెంటనే ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ చిన్న రౌడీ హీరో అని చెప్పొచ్చు కదా అని కామెంట్స్ చేస్తాడు.

సరే అలాగే మై ఫేవరెట్ హీరో చిన్న రౌడీ హీరో అని చెబుతుంది.మీ ఫ్రెండ్స్‌లో బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ ఎవరు? అని అడగగా.నేనే.నీ ఫొటో కూడా తిశాను కానీ, ఎవరూ క్రెడిట్‌ ఇవ్వలేదు అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube