హీరోయిన్ రష్మిక ఫేవరెట్ ప్లేస్ ఇదేనట.. నా ఫేవరెట్ హీరో మాత్రం అతనేనంటూ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) గురించి మనందరికీ తెలిసిందే.

బేబీ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

అందులో భాగంగానే ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం గం గం గణేశా.

( Gam Gam Ganesha Movie ) ఈ సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు.

ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్ లుగా నటించారు.ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

"""/" / ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ రష్మికను అందరి ముందు పలు ప్రశ్నలు వేసి అడ్డంగా బుక్ చేశారు.

మరి ఆనంద్ దేవరకొండ ఎటువంటి ప్రశ్నలు వేశారు రష్మిక ఎలాంటి సమాధానం ఇచ్చింది అన్న వివరాల్లోకి వెళితే.

మీకు బాగా ఇష్టమైన టూరిస్ట్‌ ప్లేస్‌? ఏది అని ఆనంద్ అడగగా.రష్మిక స్పందిస్తూ వియత్నం( Vietnam ) అని తెలిపింది.

ఆ తరువాత మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్‌ ఎవరు? అని ప్రశ్నించగా రష్మిక స్పందిస్తూ.

"""/" / నీ యబ్బ అనే నెమ్మదిగా అంటూనే ఆనంద్‌.నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే ఫేవరెట్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అని తెలిపింది రష్మిక.

ఆమె మాటలకు వెంటనే ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ చిన్న రౌడీ హీరో అని చెప్పొచ్చు కదా అని కామెంట్స్ చేస్తాడు.

సరే అలాగే మై ఫేవరెట్ హీరో చిన్న రౌడీ హీరో అని చెబుతుంది.

మీ ఫ్రెండ్స్‌లో బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ ఎవరు? అని అడగగా.నేనే.

నీ ఫొటో కూడా తిశాను కానీ, ఎవరూ క్రెడిట్‌ ఇవ్వలేదు అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

ఈ ఏడాది ప్రభాస్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారా.. రికార్డ్ క్రియేట్ చేస్తారా?