ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకోవడం చిన్న చిన్న మనస్పర్ధలకు విడాకులు తీసుకొని విడిపోవడం అన్నది నిజమైన ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది.
తాజాగా ఒక హిందీ ఓటీటీ విన్నర్, నటి దివ్య అగర్వాల్(divya agarwal ) పెళ్లి అయిన మూడు నెలలకే ఫోటోస్ డిలీట్ చేసింది.ఆమె ప్రియుడు వరుణ్ సూద్‌తో (Varun Sood)నడిపిన నాలుగేళ్ల ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్ పెట్టింది.
తాను కోరుకున్న విధంగా, సొంతంగా జీవించాలనుకుంటున్నా అని 2022 మార్చి 6న బ్రేకప్ వార్తను బయటపెట్టింది.
వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో(Apoorva Padgankar) ప్రేమలో పడింది.వీరిద్దరికీ 2022లో నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.ఒక షోలో కూడా తనను అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ పొంగిపోయింది నటి.కానీ అంతలోనే సడన్ షాకిచ్చింది.పెళ్లయిన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో నుంచి తీసేసింది.
దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మొన్నే పెళ్లయింది? అంతలోనే ఏంటీ ఘోరం? అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
కొందరు మాత్రం మొన్నే కదా కలిసి నవ్వుతూ ఫోటోలకు పోజిచ్చారు.ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ వార్తలపై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.