వైరల్ వీడియో: వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో 30 పాములు..

సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం చూసే ఉంటాం.మనలో చాలామంది పాము అంటే చాలు అమాంతం పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు.

 Viral Video 30 Snakes In The Water Tank Of The House, Viral Video, Social Media,-TeluguStop.com

అలాంటిది ఒకేసారి 30 పాములు కనబడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.కిలోమీటర్ దూరంలో అక్కడ ఉండకుండా పరిగెడుతాం.

ఇలాంటి సంఘటన ఒకటి వైరల్ గా మారింది.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

అస్సాం రాష్ట్రంలోని నాగవోస్ జిల్లాలోని జరిగిన ఈ ఘటన జరిగింది.ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి మూడు పాములు తలలు కనపడ్డాయి.

దాంతో అతను వెంటనే భయపడిపోయి అందులో నుంచి బయటికి వచ్చి చుట్టూ పక్కల ఉన్న వారికి విషయాన్ని తెలిపారు.ఆ తర్వాత స్థానికంగా పాములు పట్టే సంజీవ్ దేఖ్ అనే వ్యక్తికి సమాచారం అందించడంతో అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూశాడు.

ఇక అంతే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.దీనికి కారణం ఆ వాటర్ ట్యాంకులో ఏకంగా 30 పైగా పాములు కనబడ్డాయి.

దాంతో పాములు పట్టే వ్యక్తి ఒకదాని తర్వాత ఒకటి ఓ బకెట్ లోకి తీసుకొని వాటిని సుదూరంకు తరలించి అక్కడ వారిని సురక్షితంగా వదిలిపెట్టారు.ఇక్కడ అదృష్టం ఏమిటంటే.ఆ పాములన్ని బురద పాములు కావడంతో ఊపిరిపించుకున్నారు.ప్రస్తుతం ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై అనేకమంది రకరకాలుగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా కొందరైతే వామ్మో.

ఇన్ని పాములు ఒకేసారి చూస్తే.నాకు గుండె ఆగిపోయినంత పని కచ్చితంగా అవుతుందని కామెంట్ చేస్తుండగా.

, మరికొంతమంది అయితే.పెను ప్రమాదం నుంచే తప్పించుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube