ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరసగా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు.
ఇటీవల ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్(Dhanush-Aishwarya Rajinikanth), మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ నమిత( namitha) కూడా భర్త నుంచి విడిపోనుందనే రూమర్స్ వస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.వీటిపై ఇప్పుడు స్వయంగా నమిత ( namitha)స్పందించింది.కాగా నమిత మొదట సొంతం అనే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తమిళ సినిమాకు ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ బిజీగా మారిపోయింది.
కాగా నమిత 2017లో వీరేంద్ర చౌదరి (Virendra Chaudhary)అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఈ జంటకు 2022లో కవల పిల్లలు కూడా పుట్టారు.ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న నమిత.తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి.
దీనిపై స్పందిచిన నమిత.ఈ మధ్యే భర్తతో కలిసి ఫొటోలు పోస్ట్ చేశాను.అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు.నటిగా నేను ఈ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నాను.ఇప్పుడొచ్చిన దానితో నేను నా భర్త ఏం బాధపడట్లేదు.ఫుల్లుగా నవ్వుకున్నాం అని నమిత చెప్పుకొచ్చింది.