స్కూల్ స్టాఫ్ విద్యార్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.వారిని ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉండాలి.
లేకపోతే ప్రమాదాలు జరిగి పోయే అవకాశం ఉంది.స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే చాలా మంది పిల్లలు చనిపోయారు.
ఇక బస్సు డ్రైవర్లు, క్లీనర్లు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించి చిన్న పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు.తాజాగా ఒక 4 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కూడా దాదాపు పోయేవే ప్రమాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఉదయం స్కూల్ బస్సులో( School Bus ) నిద్రపోవడం వల్ల, తనను ఎవరూ గమనించలేదు.అదృష్టం కొద్దీ చివరికి ఆమెను గుర్తించి, రక్షించారు.
ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని( United Arab Emirates ) షార్జాలో( Sharjah ) చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే, ఉదయం స్కూల్ బస్సులో వెళ్తున్నప్పుడు, ఆ చిన్నారి నిద్రపోయింది.
బస్సు స్కూల్ చేరుకున్న తర్వాత, స్టాఫ్ అందరూ బయటకు వెళ్ళిపోయారు.చిన్నారి బస్సులోనే నిద్రిస్తూ ఉండిపోయింది.
చాలాసేపటి తర్వాత, ఒక క్లీనర్ ఆమెను గుర్తించి, అధికారులకు తెలియజేశారు.వెంటనే చిన్నారిని రక్షించి, ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

ఉదయం 6 గంటలకు స్కూల్ బస్సు ఎక్కిన చిన్నారి, బస్సులోనే నిద్రపోయింది.7:30 గంటల సమయంలో, బస్సు కండక్టర్( Bus Conductor ) ఆమె తల్లికి ఫోన్ చేసి, పిల్లలని స్కూల్లో దింపలేదని, బస్సులోనే నిద్రిస్తున్నట్లు తెలిపాడు.ఆందోళన చెందిన తల్లి, టీచర్‌కు ఫోన్ చేసింది.కానీ, టీచర్‌కు( Teacher ) ఆ విషయం తెలియదు.వెంటనే స్కూల్‌కు పరుగెత్తిన తల్లిదండ్రులు, బస్సులో ఏడుస్తున్న తమ పిల్లలను చూసి షాక్‌కు గురయ్యారు.ఆమె ఉదయం 6 గంటల నుంచి 8:40 గంటల వరకు బస్సులోనే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడిపింది.చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.

అదృష్టవశాత్తూ, ఆమెకు ఎటువంటి గాయాలు లేదా ఇతర సమస్యలూ లేవు.పరీక్షలు అన్నీ సాధారణంగా ఉన్నాయి.అయితే స్కూల్ యాజమాన్యం ఈ చిన్నారి కాసేపు మాత్రమే పడుకుందని వెంటనే కాపాడమని తెలిపింది.
తల్లిదండ్రులు మాత్రం స్థానిక అధికారుల వద్ద ఈ స్కూల్ పై కేసు ఫైల్ చేశారు.







