‘‘హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ’’( Hurun Research Institute ) విడుదల చేసిన సజీవంగా ఉన్న అత్యంత విజయవంతమైన భారతీయ కళాకారుల హురున్ ఇండియా ఆర్ట్ లిస్ట్‌లో లండన్‌లో స్థిరపడిన భారత సంతతి కళాకారుడు అనీష్ కపూర్( Anish Kapoor ) వరుసగా ఆరో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచాడు.జనవరి 1, 2024 నాటికి బహిరంగ వేలంలో అమ్మకాల ప్రకారం జీవించి ఉన్న టాప్ – 50 భారతీయ కళాకారులకు ర్యాంకులు ఇచ్చారు.
ఈ సందర్భంగా హురున్ రిపోర్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ .‘‘ హురున్ ఇండియా ఆర్ట్ లిస్ట్ 2024 ’’( Hurun India Art List 2024 ) భారతీయ కళకు డిమాండ్ పెరుగుతోందని రుజువు చేస్తుందన్నారు.ఉదాహరణకు టాప్ 10 ఆర్టిస్టుల ఎంట్రీ పాయింట్ 2021లో రూ.1.99 కోట్లు ఉండగా.2024లో ఇది రూ.7.70 కోట్లకు పెరిగింది.అంటే దాదాపు 287 శాతం పెరుగుదల అని జునైద్ పేర్కొన్నారు.గతేడాది మొత్తం 789 లాట్లను విక్రయించగా.అంతకుముందు సంవత్సరం 539 లాట్లను విక్రయించారు.అంటే 46 శాతం పెరుగుదల.భారతదేశంలో అత్యంత విజయవంతమైన కళాకారుల రచనలు రూ.301 కోట్ల రికార్డు విక్రయాలను నమోదు చేసి ఏడాదికి 19 శాతం వృద్దిని సూచిస్తోందని హురున్ రిపోర్ట్ తెలిపింది.

ఈ జాబితాలో అత్యంత వృద్ధ కళాకారుడు 98 ఏళ్ల క్రిషెన్ ఖన్నా. ఈయన ఐదవ స్థానంలో నిలవగా.ఆయన మొత్తంగా రూ.18 కోట్ల అమ్మకాలను పొందారు.అత్యంత పిన్న వయస్కుడైన ఆర్టిస్ట్‌గా లండన్‌కు చెందిన 27 ఏళ్ల రాఘవ్ బబ్బర్ నిలిచారు.ఆయన రూ.12 కోట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానం దక్కించుకున్నారు.గుజరాత్‌లోని బరోడాకు చెందిన ఆర్టిస్ట్ పెడాగోగ్ గులమ్మమ్మద్ షేక్( Pedagogue Gulammohammed Sheikh ) రెండవ స్థానంలో , ఢిల్లీకి చెందిన అర్పితా సింగ్( Arpita Singh ) మూడో స్థానంలో నిలిచారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లతో భారతీయ మార్కెట్‌లను పోల్చి చూస్తే జునైద్ ఇలా అన్నారు.2023లో భారతీయ ఆర్ట్ మార్కెట్ పనితీరు చెప్పుకోదగినదే అన్నారు.ఇది ప్రపంచ సగటు (62)ని అధిగమించింది.ఈ ఆర్ట్ వేలం టర్నోవర్ పరంగా భారతదేశాన్ని ప్రపంచంలో ఏడో స్థానంలో నిలబెట్టింది.టాప్ – 5లో ఉన్న చైనాను మినహాయిస్తే యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లు ఆర్ట్ వేలం ద్వారా వచ్చే ఆదాయంలో క్షీణతను నమోదు చేశాయనే వాస్తవాన్ని పరిగణనలోనికి తీసుకుంటే ఇది ఆసక్తికరం.