బేబీ సినిమా చూసి బాగా ఏచ్చాను... రష్మిక కామెంట్స్ వైరల్!

విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ‘గం గం గణేశా‘( Gam Gam Ganesha ) సినిమాతో మే 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా నిన్న రాత్రి గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రష్మిక మందన్న ( Rashmika Mandanna ) హాజరయ్యారు.

 Rashmika Mandanna Interesting Comments On Baby Movie Director Sai Rajesh, Sai Ra-TeluguStop.com

  ఇక ఈ కార్యక్రమానికి బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక బేబీ( Baby ) డైరెక్టర్ సాయి రాజేష్ ( Sai Rajesh ) ని ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాను బేబీ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కలవాలని అనుకున్నాను అని మీతో సినిమా చేయాలనుకున్నానని ఈమె తెలిపారు.అలాంటి సినిమా చేయడం అంత ఈజీ కాదు.

మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు.మొదటిసారి బేబీ సినిమా చూసినప్పుడు నేను ఏడ్చేసాను.

ఒక నటిగా ఆ సినిమా చూసాక సాయి రాజేష్ గారితో ఒక సినిమా చేయాలి, ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలనిపించింది అంటూ సాయి రాజేష్ పనితీరుపై రష్మిక ప్రశంసల కురిపిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా రష్మిక నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube