ఏపీ యువకులను రక్షించండి అంటూ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు..!!

ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది.ఈసారి ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.

 Chandrababu Has Written A Letter To Cs Jawahar Reddy Saying Protect The Youth Of-TeluguStop.com

ఈ క్రమంలో గెలుపు విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది.పోలింగ్ శాతం పెరగటంతో ఎలక్షన్ అనంతరం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు.

కానీ మరోపక్క ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా అక్రమంగా కంబోడియాలో( Cambodia ) చిక్కుకున్న తెలుగు యువతని కాపాడాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి( CS Jawahar Reddy ) లేఖ రాయడం జరిగింది.

కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కంబోడియాలో ఉద్యోగాలు అంటూ తెలుగు యువత చేత బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని.వెంటనే వారిని రక్షించాలని చంద్రబాబు కోరారు.రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నా మానవ అక్రమ రవాణా( Human Trafficking ) అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకొని.

ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను( Telugu Youth ) కాపాడి వారి రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఉపాధి అవకాశాల పేరిట ఏజెంట్లు మోసం చేస్తున్నారని ఎన్ఐఏ విచారణలో ఈ కుంభకోణం బయటపడింది.కానీ కాంబోడియా నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చంద్రబాబు తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube