ఏపీ యువకులను రక్షించండి అంటూ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు..!!

ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది.ఈసారి ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.

ఈ క్రమంలో గెలుపు విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది.

పోలింగ్ శాతం పెరగటంతో ఎలక్షన్ అనంతరం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు.కానీ మరోపక్క ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా అక్రమంగా కంబోడియాలో( Cambodia ) చిక్కుకున్న తెలుగు యువతని కాపాడాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి( CS Jawahar Reddy ) లేఖ రాయడం జరిగింది.

"""/" / కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కంబోడియాలో ఉద్యోగాలు అంటూ తెలుగు యువత చేత బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని.

వెంటనే వారిని రక్షించాలని చంద్రబాబు కోరారు.రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నా మానవ అక్రమ రవాణా( Human Trafficking ) అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకొని.ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను( Telugu Youth ) కాపాడి వారి రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఉపాధి అవకాశాల పేరిట ఏజెంట్లు మోసం చేస్తున్నారని ఎన్ఐఏ విచారణలో ఈ కుంభకోణం బయటపడింది.

కానీ కాంబోడియా నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చంద్రబాబు తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

లేడీ ప్యాసింజర్‌పై విరుచుకుపడ్డ ఆటో డ్రైవర్.. వీడియో వైరల్..