టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్( Allu Arjun ) క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.పుష్ప ఫ్రాంఛైజీలో భాగంగా వరుస సినిమాలలో ఆయన నటిస్తుండగా పుష్ప 3 సినిమా( Pushpa 3 ) కూడా తెరకెక్కనుందని 2027లో ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
పుష్ప ది రూల్ మాత్రం ఈ ఏడాదే థియేటర్లలొ విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
అయితే స్టార్ హీరో బన్నీ కేజీఎఫ్( KGF ) ఫార్ములాను ఫాలో అవుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.కేజీఎఫ్ సిరీస్ లో భాగంగా కేజీఎఫ్ 3 ( KGF 3 ) తెరక్కెకుతుండగా పుష్ప సిరీస్ లో భాగంగా పుష్ప3 కూడా తెరకెక్కనుండటం గమనార్హం.కేజీఎఫ్3 కంటే ముందే పుష్ప3 రిలీజైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కేజీఎఫ్2 పూర్తైన వెంటనే కేజీఎఫ్3 మొదలుకాలేదు.
అదే విధంగా పుష్ప ది రూల్( Pushpa The Rule ) విడుదలైన వెంటనే పుష్ప3 కూడా తెరకెక్కే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.బన్నీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాతే అల్లు అర్జున్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
పుష్ప 2 ( Pushpa 2 ) సక్సెస్ సాధిస్తే పుష్ప3 సినిమాను మరింత భారీ రేంజ్ లో మేకర్స్ ప్లాన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.అల్లు అర్జున్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.ఇప్పుడిప్పుడే ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బన్నీ సుకుమార్ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అని నెటిజన్లు చెబుతున్నారు.