రైతులకు శుభవార్త :  ఆ హామీ అమలుదిశగా రేవంత్  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలను అమలు చేసే విషయంలో అంత చొరవ చూపించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తుమయ్యాయి.

 Good News For Farmers: Revanth Is Implementing That Promise, Revanth Reddy, Rit-TeluguStop.com

ముఖ్యంగా రైతు రుణమాఫీ( Rythu Runa Mafi ) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి రావడం,  రుణమాఫీ అమలు చేసే పరిస్థితి లేదన్నట్లుగా వ్యవహారాలు చోటు చేసుకోవడం వంటివి కాంగ్రెస్ కు మరింత ఇబ్బందికరంగా మారుతూ వచ్చాయి.అయితే రైతుల రుణమాఫీ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి దాని అమలు దిశగా కసరత్తు మొదలుపెట్టారు.

జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే రుణమాఫీ పై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Telugu Revanth Reddy, Rithu Runa Mafi, Rythu Runa Mafi, Telangana-Politics

 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రేవంత్ కసరత్తు మొదలుపెట్టారు .ఇప్పటికే దీనిపై పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ అనేకసార్లు ప్రకటించారు.రైతు రుణమాఫీ కి సంబంధించి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో స్వయంగా రేవంత్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

  ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు ప్రతి సభలోను రేవంత్ చేసిన ప్రకటన అమలు చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.ఇక రైతు రుణమాఫీ కి సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ? ఎంత మొత్తం రుణాన్ని మాఫీ చేయాల్సి ఉంటుందనే దానిపైన ఇప్పటికే నివేదికలను సిద్ధం చేసుకున్నారు.ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో దానికి అనుగుణంగానే అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

Telugu Revanth Reddy, Rithu Runa Mafi, Rythu Runa Mafi, Telangana-Politics

 ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే మిగిలినది రైతులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణం తీసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటారు .బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నా, ఆ రుణాన్ని మాఫి చేయనున్నట్లు తెలుస్తోంది.కాకపోతే దీర్ఘకాలిక రుణాలకు మాత్రం ఇది వర్తించదని అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube