పాపువా న్యూ గినియా( Papua New Guinea ) అనేది ఓషియానియాలోని దేశం.ఇటీవల ఈ దేశంలోని ఎంగ ప్రావిన్స్‌లో( Enga Province ) భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి.
ఒక గ్రామం మీద ఈ ల్యాండ్ స్లైడ్( Landslide ) పడింది.ఊహించని విధంగా ఒకసారి గా ఇది కుప్పకూలడంలో 2000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు.
రక్షణ బృందాలు, గ్రామస్థులు కలిసి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కనుగొని, మృతి చెందిన వారి మృతదేహాలను వెలికి తీయడానికి కృషి చేస్తున్నారు.కానీ, ఇప్పటివరకు కేవలం కొద్ది మంది మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు.
శిథిలాలు చాలా లోతుగా, అస్థిరంగా ఉండటం, తగినంత పరికరాలు లేకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్( Rescue Operation ) నత్తనడకన సాగుతున్నాయి.
ఎక్కడ చూసినా విషాద ఛాయలే అలుముకున్న ఈ ప్రాంతంలో ఒక అద్భుతంగా చోటు చేసుకుంది.
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఒక జంట ప్రాణాలతో బయటపడ్డారు.వారి ఇల్లుపై కొండచరియలు విరిగిపడ్డా పూర్తిగా నాశనం కాలేదు.
లోపల ఉన్న జాన్సన్,( Johnson ) జాక్లిన్ యండమ్( Jacklyn Yandam ) శిథిలాల కింద ఎనిమిది గంటలకు పైగా చిక్కుకుని ఉన్నారు.చివరికి వారిని రక్షించారు.
వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు.దేవుడే ఒక గొప్ప కార్యం తమకు అప్పజెప్పాడని, అందుకే తాము ఇంత పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడగలిగామని నమ్ముతున్నారు.

ఈ ఘటనకు సాక్ష్యుడైన ఒక వ్యక్తి, యండమ్ దంపతుల ఇంటి చుట్టూ పెద్ద రాళ్లు కూలిపోయాయని చెప్పారు.ఈ రాళ్ళు ఒక షీల్డ్ లాగా పనిచేసి, వారిని మరింత శిథిలాల నుంచి రక్షించాయి.వారిని త్వరగా కనుగొనకపోతే, ఆహారం, నీరు లేకపోవడం వల్ల వారు మరణించే అవకాశం ఉంది.యండమ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, భూమి కుప్పకూలిన సమయంలో వారు ఆ గ్రామంలో లేకపోవడం వల్ల వారు బతికి పోయారు.

భూమి కుప్పకూలే ముందు, ఈ గ్రామంలో దాదాపు 3,800 మంది నివసిస్తున్నారు.ఈ విషాద ఘటన తర్వాత, గ్రామస్థులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని కనుగొనడానికి, మృతదేహాలను వెలికి తీయడానికి వారు చొంబులు, చేతులతో తవ్వుతున్నారు.రెస్క్యూ చాలా నెమ్మదిగా జరుగుతుందని ఒక గ్రామ నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు.
చాలా మంది మృతదేహాలు ఇంకా లోపలే చిక్కుకున్నాయి, ప్రాంతం ఇప్పటికీ భారీ శిథిలాలతో నిండి ఉంది.చిక్కుకున్న వారిని చేరుకోవడం రక్షణ సిబ్బందికి చాలా కష్టంగా ఉంది.
గ్రామస్థులు ప్రభుత్వం నుంచి సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.