నైజీరియాలోని( Nigeria ) ఎడో రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఒక భయంకరమైన సంఘటన అందరినీ కలచివేసింది.ఒక యువతి తన మాజీ ప్రేమికుడిపై( Ex Boyfriend ) బాగా పగ పెంచుకుంది.
ఆ కోపంతో అతడిని చంపాలని ఒక విషపు సూప్‌ను( Poisoned Soup ) ప్రిపేర్ చేసింది.తన మాజీ ప్రియుడి వద్దకు వెళ్లి ఆ విషం కలిపిన సూప్ అందించింది.
అది తాగి మొత్తం ఐదుగురు మరణించారు.తమ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేక ఆందోళన చెందిన బంధువులు ఇంటికి వెళ్లి చూసేసరికి అందరూ చనిపోయి ఉన్న దృశ్యం కనిపించింది.
ఆ యువతి తన మాజీ ప్రేమికుడిని మాత్రమే హతమార్చాలని భావించి సూప్‌లో విషం కలిపింది.కానీ, ఆమె మాజీ ప్రేమికుడితో పాటు అతని ప్రస్తుత లవర్, మరో ముగ్గురు స్నేహితులు కూడా ఆ సూప్ తాగి ప్రాణాలు కోల్పోయారు.
అక్కడ ప్రజలు ఎక్కువగా పెప్పర్ సూప్ తాగుతుంటారు.అందులోనే ఈ గర్ల్‌ఫ్రెండ్( Girlfriend ) విషం కలపడం జరిగింది.ఆ విషపు సూప్‌లో విషం ఉందని తెలియక, ఆ యువతి మాజీ ప్రేమికుడు ఆ సూప్ తాగి తన స్నేహితులతో పంచుకున్నాడు.పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఎడో రాష్ట్ర పోలీసు ప్రతినిధి మోసెస్ యాము మాట్లాడుతూ, ఈ మరణాలకు కారణం ఆహార విషం లేదా జనరేటర్ నుంచి వచ్చిన విష వాయువు కావచ్చు అని చెప్పారు.ఈ ఘటన, ప్రతీకారం ఎంత దూరం వెళ్ళగలదో చూపిస్తోంది.
ఈ విషాదం వల్ల జరిగిన నష్టాన్ని ఎవ్వరూ తిరిగి పూడ్చలేరు.
ఇంతమంది చావుకి కారణమైన ఆ అమ్మాయి పేరు ఐషా సులేమాన్( Aisha Suleiman ) అని పోలీసులు వెల్లడించారు.ఆమె వయసు కేవలం 16 ఏళ్ళే అని చెప్పారు.ఈ వయసులోనే ఇంత నేరం చేసిన ఈ అమ్మాయి సమాజంలో ఉండకూడదు అని పోలీసులు చెబుతున్నారు.
ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష పడేలాగా చేస్తామని మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.