దీపావళి పండుగ( Deepavali Festival ) వేళ చాలామంది కుటుంబ ప్రజలు తమకు ప్రియమైన వారికి బహుమతులు ఇచ్చి సంతోషపెట్టారు.ప్రియమైన వారిని సర్‌ప్రైజ్ చేస్తూ వారి రియాక్షన్లను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఇలాగే ఓ యువకుడు కూడా తన తల్లిని( Mother ) సర్‌ప్రైజ్ చేశాడు.ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అది కాస్త వైరల్ అయింది.అందులో ఒక కొడుకు తన తల్లికి దీపావళి కానుకగా ఐఫోన్ 15( Iphone 15 ) ఫోన్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.
తల్లి ఆ కానుక చూసి చాలా హ్యాపీగా రియాక్ట్ అయింది.ఈ క్షణం చూసేందుకు చాలా హార్ట్ టచింగ్‌గా ఉండటంతో అందరూ ఫిదా అయిపోయారు.

ఆ కొడుకు పేరు సోమ్రత్ దత్తా.( Somrat Dutta ) తన ఆలోచనలను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నాడు.“నా తల్లి గత నాలుగు ఏళ్లుగా ఒక ఓల్డ్ రెడ్‌మీ ఫోన్ వాడుతోంది, ఆమెకు ఏదో ఒక రోజు ఐఫోన్ కొనివ్వాలని నేను ఎప్పుడూ కోరుకునేవాడిని.ఆ రోజు ఇప్పుడే వచ్చింది.” అని సోమ్రత్ దత్తా తన పోస్ట్‌కి ఒక కామెంట్ పెట్టాడు.తన తల్లిదండ్రులు కశ్మీర్ ప్రయాణానికి సిద్ధమయ్యారని, ఆ సమయంలో తన తల్లికి మంచి కెమెరాలు ఉన్న ఫోన్ ఇవ్వడం మంచిగా అయిందని అన్నాడు.“ఇప్పుడు ఇద్దరూ ఐఫోన్‌లో తమ అద్భుతమైన జ్ఞాపకాలను బంధించవచ్చు,” అని ఆయన అన్నాడు.వైరల్ వీడియోలో తల్లి కుమారుడు ఇచ్చిన గిఫ్ట్ చూసి చాలా సంతోష పడటం మనం చూడవచ్చు.
అలాగే తన కుమారుడిని ప్రేమగా హత్తుకుంది.

ఈ పోస్ట్‌పై చాలామంది ఎమోషనల్‌గా కామెంట్స్ చేశారు.చాలా మంది ఎక్స్ యూజర్లు తమదైన కథలను పంచుకున్నారు.ఒకరు, “మీ కానుక నన్ను చాలా ఎమోషనల్‌గా చేసింది.
నేను కూడా ఇటీవల మా నాన్నకు ఒక మొబైల్ ఇచ్చాను.చాలా సంవత్సరాల క్రితం, ఆయనే నాకు మొదటి ఫోన్ కొనిచ్చారు.
ఇప్పుడు నేను కూడా ఆయన కోసం అదే చేయగలిగాను” అని రాశారు.మరొకరు ఆ వీడియోను “వెరీ మచ్ హార్ట్ టచింగ్.” అని అన్నారు.








