ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో కేంద్ర అధికార పార్టీ బిజెపి జమిలి ఎన్నికలను( Jamili Elections ) నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది.అన్ని అనుకున్నట్లు జరిగితే 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్ చేసుకుంటుంది.
ఇప్పటికే జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోది( PM Modi ) ప్రకటన సైతం విడుదల చేసిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు జమిలి ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి.ఇక తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విషయానికి వస్తే , వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ను ఓడించి బిజెపికి అవకాశం లేకుండా చేసి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది.ఈ నేపథ్యంలోనే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజల్లోకి బీఆర్ఎస్ ను తీసుకు వెళ్ళేందుకు పాదయాత్ర( Padayatra ) చేపట్టడం ఒక్కటే మార్గమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
![Telugu Brs, Congress, Jamili, Ktr Padayathra, Revanth Reddy, Telangana-Politics Telugu Brs, Congress, Jamili, Ktr Padayathra, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/11/ktr-planning-for-padayatra-detailsa.jpg)
సుదీర్ఘ పాదయాత్రతో అధికారంలోకి రావాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తనను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్న కార్యకర్తలతోనూ కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతానని ప్రకటిస్తున్నారు.
కాకపోతే ఆ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలు పెడతారు అనేది క్లారిటీ ఇవ్వకపోయినా , వచ్చే ఏడాది మొదట్లోనే పాదయాత్రను ప్రారంభించే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, రైతుకు రుణమాఫీ సక్రమంగా జరగలేదని రైతు భరోసాను అమలు చేయకపోవడం, హైడ్రా కూల్చివేతలు, మూసి సుందరీకరణ ప్రాజెక్టు వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వీటిని ప్రధాన అంశాలుగా తీసుకుని పాదయాత్ర చేపట్టే ఆలోచనతో కేటీఆర్ ఉన్నాడట.
![Telugu Brs, Congress, Jamili, Ktr Padayathra, Revanth Reddy, Telangana-Politics Telugu Brs, Congress, Jamili, Ktr Padayathra, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/11/ktr-planning-for-padayatra-detailss.jpg)
ఈ పాదయాత్ర ద్వారా పార్టీ కార్యకర్తలు , నేతల్లోనూ భరోసా నింపే విధంగా బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని కేటీఆర్ భావిస్తున్నారట.రంగారెడ్డి జిల్లా నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించి, ఆదిలాబాద్ లో ముగించాలని ప్లాన్ చేస్తున్నారట.ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను ఒక ప్రత్యేక టీంకు అప్పగించినట్లు సమాచారం.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి అధికారంలోకి రావడం, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ లోనూ వైఎస్ జగన్, నారా లోకేష్ ఎన్నికలకు ముందు నుంచి చేపట్టిన పాదయాత్ర ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చాయిని , ఇప్పుడు తాను పాదయాత్ర నిర్వహిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో కేటీఆర్ ఉన్నారట.