కలబంద పెద్దగా ఖర్చులేకుండా దొరుకుతుంది.అయినా సరే, దాన్ని బద్ధంకం అనాలో, నిర్లక్ష్యం అనాలో కాని మనలో ఎవరు దానిని సరిగా వాడుకోలేకపోతున్నాం.
కాని ప్రాచీన కాలం నుంచి కలబందకి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నారు వైద్యులు.కలబందకు అంత ముఖ్యత ఇవ్వడానికి కారణాలేటంటే …
* కలబందలో విటనిమ్ ఏ,సి,ఈ,బి1, బి2, బి3, బి 6, బి12, ఫోలిక్ ఆసిడ్, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం మరియు సెలెనియం దొరుకుతాయి.
* కలబందలో పాలిసాచరైడ్స్ మంచి మోతాదులో దొరుకుతాయి.ఇవి మన రోగనిరోధకశక్తిని పెంచి ఇమున్యుటి సిస్టమ్ ని శక్తివంతంగా తయారుచేస్తాయి.కలుషిత గాలి, నీరు నుంచి రక్షించుకోవాలంటే రోజూ కలబంద జ్యూస్ తాగితే మంచిది.
* కలబందలో సహజసిద్ధమైన విటమిన్స్ తో పాటు ఎంజిమ్స్ ఉంటాయి.
జుట్టు బాగా పెరగటానికి, బలంగా తయారవడానికి కలబంద ఉపయోగపడుతుంది.
* చర్మ ఆరోగ్యానికి కలబందను మించిన ఔషధం లేదు.
ఇది మొటిమలను అరికట్టడానికి, మృదువైన చర్మం పొందటానికి చాలా ఈజీగా దొరికే మందు లాంటిది.
* అజీర్ణ సమస్యలతో బాధపడేవారు కలబంద సహాయం తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
* బ్లడ్ షుగర్ లెవెల్స్ తో పాటు, కొవ్వుని తగ్గించే సామర్థ్యం కలబందలో ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు తెలిపాయి.
* రోజూ కలబంద తిన్నా, జ్యూస్ లాగా తాగినా, ఇది మీ శరీరంలో పేరుకుపోయిన మలినాల్ని, చెత్తని బయటకి తీస్తుంది.
రోజూ కలబంద తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం పెట్టుకోనక్కరలేదు.