సల్మాన్ మెచ్చిన పెళ్లిచూపులు..!

రీసెంట్ గా రిలీజ్ అయ్యి చిన్న సినిమాగా పెద్ద విజయాన్ని అందుకున్న పెళ్లిచూపులు సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ సక్సెస్ అందుకుంది.విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా నటించిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది.

 Pelli Choopulu Hindi Remake Under Salman Khan Production-TeluguStop.com

కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ ఇవన్ని కొత్తగా ఉండటంతో రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ఆడియెన్స్ కు ఇదో చేంజ్ ఓవర్ లా అనిపించింది.అందుకే రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్నా స్టాండర్డ్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది.

అయితే సినిమా హిట్ అయిన నేపథ్యంలో బాలీవుడ్లో కూడా ఈ సినిమాను రూపొందించేందుకు కార్యచరణలు చేస్తున్నారు.ఇప్పటికే చిత్ర దర్శక నిర్మాతలు తరుణ్ భాస్కర్, రాజ్ కందుకూరి సల్మాన్ ఖాన్ కు సినిమా స్పెషల్ గా చూపించారట.

ఇక సల్మాన్ పెళ్లి చూపులు టీం కలవడానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ సహకారం ఉందట.ఫైనల్ గా సల్మాన్ కూడా పెళ్లిచూపులు సినిమాను హిందిలో రీమేక్ చేసేందుకు ఓకే చెప్పారట.

సల్మాన్ నిర్మాణంలో ఓ కొత్త హీరోతో పెళ్లిచూపులు హింది రీమేక్ అవుతుందని టాక్.సో మొత్తానికి ఇక్కడ సక్సెస్ అవడమే కాకుండా బాలీవుడ్లో కూడా పెళ్లి భాజాలు మోగించడానికి రెడీ అయ్యారు పెళ్లిచూపులు టీం.సల్మాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను హిందిలో కూడా తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube